Ram Gopal Varma: 'ఆర్ఆర్ఆర్'పై రామ్ గోపాల్ వర్మ రివ్యూ..

Ram Gopal Varma: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' ప్లేస్‌తో సంబంధం లేకుండా అన్నిచోట్లా రికార్డులను తిరగారాస్తూ వెళ్తోంది. ఇప్పటికే ప్రేక్షకుల దగ్గర నుండి సినీ సెలబ్రిటీల దగ్గర నుండి ఆర్ఆర్ఆర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ అందుతోంది. తాజాగా రామ్ గోపాల్ వర్మ కూడా ఆర్ఆర్ఆర్‌పై ట్వీట్ చేశారు. రాజమౌళిపై వర్మ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రామ్ గోపాల్ వర్మ ఏదైనా స్ట్రెయిట్‌గా చెప్పరు. అందుకే ఆయనను అందరూ కాంట్రవర్షియల్ డైరెక్టర్ అంటుంటారు. అయితే తాజాగా విడుదలయిన 'ఆర్ఆర్ఆర్' చిత్రంపై ఆర్‌జీవి ఎలాంటి రివ్యూ ఇస్తారా అని అందరూ ఎదురుచూస్తుండగా తాజాగా తన ట్విటర్‌లో ఆర్ఆర్ఆర్ గురించి ట్వీట్ చేశాడు ఆర్‌జీవి. ప్రతీ విషయంలో కాంట్రవర్సీ క్రియేట్ చేసే వర్మ చేసిన ఈ ట్వీట్‌కు అసలు అర్థం ఏంటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు.
'బాహుబలి 2 చరిత్ర, ఆర్ఆర్ఆర్ చారిత్రాత్మకం, రాజమౌళి.. బాక్సాఫీసుకు మోక్షం కల్గించిన గొప్ప వ్యక్తి' అని ట్వీ్ట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఆర్‌జీవి ఒక సినిమాపై ఇంత నార్మల్‌గా రివ్యూ ఇవ్వడం చూసి తన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే టాలీవుడ్‌లోని టాప్ సెలబ్రిటీలు దాదాపుగా ఆర్ఆర్ఆర్ చూసేసి.. వారి రివ్యూలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
BAHUBALI 2 is history, RRR is HISTORICAL and @ssrajamouli is MYSTICAL for making the boxoffice SPIRITUAL 🙏🙏🙏
— Ram Gopal Varma (@RGVzoomin) March 26, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com