Ram Gopal Varma: వర్మ మరో షాకింగ్ ట్వీట్.. ఈసారి స్టార్ హీరోల రెమ్యునరేషన్‌పై..

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ ఎవరు ఏం అనుకుంటారో అని ఆలోచించకుండా ఆయనకు ఏదీ అనిపిస్తే అది చెప్పేసే వ్యక్తి అని అందరికీ తెలుసు. కానీ ఆయన ఎప్పుడు ఎవరిని ప్రశంసిస్తారో.. ఎప్పుడు ఎవరిని విమర్శిస్తారో మాత్రం తెలియదు. ఇటీవల కేజీఎఫ్ చాప్టర్ 2 బాగుందంటూ ట్వీట్ చేశారు వర్మ. ఇంతలోనే ఆ సినిమాను ఉదాహరణగా తీసుకొని స్టార్ హీరోల రెమ్యునరేషన్‌పై కామెంట్ చేశారు.
యశ్, ప్రశాంత్ నీల్ కలిసి కేజీఎఫ్ లాంటి చిత్రంతో శాండిల్‌వుడ్ స్థాయిని అమాంతం పెంచేశారు. దీంతో చాలామందికి వీరు ఇప్పుడు రియల్ హీరోలులాగా కనిపిస్తున్నారు. అంతకు ముందు వీరంటే ఎవరో తెలియని ప్రేక్షకులు కూడా ఇప్పుడు వీరికి అభిమానులుగా మారిపోతున్నారు. అయితే కేజీఎఫ్ సృష్టించిన సెన్సేషన్‌ను దృష్టిలో పెట్టుకుని స్టార్ హీరోల రెమ్యునరేషన్‌పై కామెంట్ చేస్తూ ట్వీట్ చేశారు వర్మ.
'స్టార్ల రెమ్యునరేషన్‌పై కాకుండా మేకింగ్‌పై డబ్బు ఎక్కువగా ఖర్చుపెడితే కేజీఎఫ్ 2లాంటి సక్సెస్ వస్తుందని చెప్పడానికి ఈ సినిమానే ప్రూఫ్. అలా చేస్తే మంచి క్వాలిటీతో పాటు భారీ హిట్లు కూడా వస్తాయి' అని ట్వీట్ చేశారు వర్మ. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
The MONSTER success of KGF 2 is a clear proof that if money is spent on MAKING and not wasted on STAR RENUMERATIONS bigger QUALITY and BIGGEST HITS will come
— Ram Gopal Varma (@RGVzoomin) April 15, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com