Ram Gopal Varma: 'ది కశ్మీర్ ఫైల్స్'పై ఆర్‌జీవీ సెన్సేషనల్ కామెంట్స్..

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ రూటే సెపరేటు. ఆయన చెప్పాలనుకున్నా దానికి ఒక స్టైల్, ఒక లాజిక్ ఉంటుంది అంటుంటారు అభిమానులు. అయితే ఈ మధ్య సినిమాల రివ్యూల విషయంలో కూడా వర్మ సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల విడుదలయిన కాంట్రవర్షియల్ సినిమా 'ది కశ్మీర్ ఫైల్స్'పై కూడా ఆర్‌జీవీ చేసిన కామెంట్ వైరల్ అవుతోంది.
నిజ జీవిత సంఘటనలను అందరూ సినిమాలుగా తెరకెక్కించే ధైర్యం చేయరు. అలాంటిది వివేక్ అగ్నిహోత్రి.. 'ది కశ్మీర్ ఫైల్స్'తో ఓ సాహసమే చేశారు. మార్చి 11న ఈ సినిమా విడుదలయ్యింది. విడుదల తర్వాతే కాదు.. ముందు నుండే ఈ చిత్రంపై ఆసక్తి రేకిత్తించారు మూవీ టీమ్. అందుకే రాజకీయ ప్రతినిధులు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు వారిలో చేరారు రామ్ గోపాల్ వర్మ.
'ది కశ్మీర్ ఫైల్స్' టాక్‌తో పాటు కలెక్షన్లను కూడా పాజిటివ్‌గా సంపాదించుకుంటోంది. నరేంద్ర మోదీ సైతం 'ది కశ్మీర్ ఫైల్స్' బాగుందంటూ తెలిపారు. ఈ ప్రశంస సినిమాకు మరింత ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ఇప్పుడు మరోసారి రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ద్వారా దీనిపై అందరి దృష్టిపెట్టింది.
'డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాతో పేలుడు పదార్థాలు కంటే ఎక్కువగా ఫైర్ అయ్యారు. ఈ సినిమాతో బాలీవుడ్‌ని తొక్కేసి కొత్తగా వివేక్ వుడ్‌ని స్థాపించినట్టే. కొత్త సినిమా దర్శక నిర్మాతలకి స్ఫూర్తిగా నిలిచాడు వివేక్. ది కశ్మీర్ ఫైల్స్ కమర్షియల్ సక్సెస్‌ని పక్కన పెడితే అంతకంటే కూడా భారీ విజయం సాధించింది' అని ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ.
Apart from the EXPLOSIVE material he so DARINGLY exposed , #VivekRanjanAgnihotri TRAMPLED BOLLYWOOD by CREATING his own VIVEKWOOD which will inspire a new BREED of revolutionary film makers and that's the ULTIMATE victory more than #KashmirFiles humongous commercial success
— Ram Gopal Varma (@RGVzoomin) March 14, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com