Ram Gopal Varma : స్మార్ట్‌ పీపుల్‌ లవ్‌ చేస్తారు... మూర్ఖులే పెళ్లి చేసుకుంటారు : ఆర్జీవీ

Ram Gopal Varma : స్మార్ట్‌ పీపుల్‌ లవ్‌ చేస్తారు... మూర్ఖులే పెళ్లి చేసుకుంటారు : ఆర్జీవీ
X
Ram Gopal Varma : టాలీవుడ్‌ స్టార్‌ కపుల్స్‌ నాగచైతన్య, సమంత డైవర్స్‌ మ్యాటర్ ఎంత హాట్ టాపిక్ అయిందో అందరికీ తెలిసిందే.

Ram Gopal Varma : టాలీవుడ్‌ స్టార్‌ కపుల్స్‌ నాగచైతన్య, సమంత డైవర్స్‌ మ్యాటర్ ఎంత హాట్ టాపిక్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు కోలీవుడ్‌‌లో స్టార్‌ కపుల్స్‌‌‌గా ఓ వెలుగు వెలిగిన తమిళ హీరో ధనుష్‌, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కూతురు ఐశ్వర్యల డైవర్స్‌ మ్యాటర్ కూడా అంతే హాట్ టాపిక్ గా మారింది. విడాకులు తీసుకుంటున్నట్టుగా సోషల్ మీడియా వేదికగా స్వయంగా వెల్లడించారు ధనుష్, ఐశ్వర్య.

తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి నిన్నటితో ఎండ్‌కార్డు వేశారు. అయితే వీరిద్దరి విడాకుల పైన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. 'పెళ్ళిళ్ళు ఎంత ప్రమాదకరమో హెచ్చరించడానికి తారల విడాకులే మంచి ట్రెండ్‌ సెట్టర్స్‌' అని వర్మ ట్వీట్ చేశాడు.

అంతటితో ఆగకుండా 'సంతోషంగా ఉండటానికి రహస్యం ఏంటంటే.. పెళ్లి అనే జైలుకు వెళ్లడం కంటే వీలైనంతవరకూ ప్రేమించడం ఉత్తమం', 'స్మార్ట్‌ పీపుల్‌ లవ్‌ చేస్తారు. మూర్ఖులే పెళ్లి చేసుకుంటారు' అంటూ వరుస ట్వీట్లు చేశాడు వర్మ.. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


Tags

Next Story