Ram Gopal Varma: బుర్జ్ ఖలీఫాపై ఆర్జీవీ సినిమా ట్రైలర్..

Ram Gopal Varma: ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న లడ్కీ- ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ అనే సినిమా ట్రైలర్ నేడు బుర్జ్ ఖలీఫా మీద ప్రదర్శింపబడింది. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రపంచ ప్రసిద్ధ కట్టడం మీద ప్రదర్శింపబడిన తొలి హిందీ చిత్రం ట్రైలర్ ఇదే కావడం గమనార్హం. దర్శకుడు రాం గోపాల్ వర్మ,చిత్ర కథానాయిక పూజా నేడు ఈ కార్యక్రమానికి విచ్చేసారు.
"ఇంత గొప్ప మానవ నిర్మితమైన బుర్జ్ ఖలీఫా మీద నా చిత్రం ట్రైలర్ ప్రదర్శింపబడడం గర్వంగా ఉంది.ఇది బ్రూసిలీకి దక్కిన సరైన గౌరవం అని నేను అనుకుంటున్నాను" అని రాం గోపాల్ వర్మ అన్నారు.
బ్రూస్లీ నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే విశేషమైన ప్రచారం జరుపుకుంది.చైనీస్ ఉపశీర్షికలతో (సబ్టైటిల్స్) ఈ చిత్రం చైనాలో ఏకంగా 30,000 థియేటర్ల లో విడుదలవుతోంది. చైనాలో అత్యధిక సినిమా హాల్స్ లో విడుదలవుతున్న తొలి భారతీయ చిత్రంగా అరుదైన గౌరవాన్ని కూడా ఈ చిత్రం పొందుతోంది.
AHEM ! 😎😎😎 I won't be lying if I don't say I am not proud of this moment pic.twitter.com/3JXhYOIbEm
— Ram Gopal Varma (@RGVzoomin) November 29, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com