Ram Gopal Varma : రజినీకాంత్ పై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

ఎప్పుడూ కాంట్రవర్శీయల్ కామెంట్స్ తో న్యూస్ లో ఉండే రామ్ గోపాల్ వర్మ టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ తర్వాత ఇప్పుడు రజినీకాంత్ పై పడ్డాడు. తాజాగా రజినీకాంత్ మంచి నటుడే కాదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో అతను ఈ మాటలు చెప్పాడు. అయితే కొందరు రామ్ గోపాల్ వర్మ వెర్షన్ ను కరెక్టే అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం.
వర్మ ఏం చెప్పాడంటే.. ‘రజినీకాంత్ మంచి నటుడు అని నేననుకోవడం లేదు. అతను భిక్కూ మాత్రే (సత్యలో మనోజ్ బాజ్ పేయి పాత్ర పేరు) లాంటి పాత్ర చేయగలడు అని అనుకోవడం లేదు. అసలు.. స్లో మోషన్ అనేది లేకపోతే రజినీకాంత్ అనేవాడు ఉండేవాడు కాదు. చార్లీ చాప్లిన్ లా స్లో మోషన్ వల్లే రజినీ సర్వైవ్ అవుతున్నాడు..’అని అతను చెప్పిన మాటలు మంటలు రేకెత్తిస్తూనే ఉన్నాయి. ఆర్జీవీ వెర్షన్ కు యాంకర్ కూడా నిజం అని చెప్పడంతో అతన్ని కూడా విమర్శిస్తున్నారు రజినీకాంత్ ఫ్యాన్స్.
రామ్ గోపాల్ వర్మ మాటలపై విమర్శలు చేస్తూనే.. రజినీకాంత్ నటించిన కొన్ని పాత సినిమాల్లోని క్లిప్స్ ను ఉదాహరణలుగా చూపిస్తూ ఇది నటన కాదా అని ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్. ఆయన బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి నటిస్తున్నాడు. నేటికీ అందరు హీరోలకు పోటీ ఇస్తున్నాడు అది కనిపించడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా రామ్ గోపాల్ వర్మ రజినీకాంత్ ను కెలికాడు కాబట్టి ఫ్యాన్స్ నుంచి గట్టి విమర్శలే ఫేస్ చేయాల్సి ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com