రామ్, బోయపాటి సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, సక్సెస్ ఫుల్ దర్శకుడు బోయపాటి కాంబినేషన్ లో సినిమా వస్తుంది. ఈ చిత్రానికి టైటిల్ పెట్టలేదు కానీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. సెప్టెంబర్ 15న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవనుందని చిత్ర యునిట్ తెలిపింది. ఇందుకుగాను సోషల్ మీడియాలో పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో రామ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.
తాజాగా విడుదలైన పోస్టర్ లో రామ్ మాస్ లుక్ లో కనిపించాడు. పచ్చని పంట పొలాల్లో నులకమంచం వేసుకుని కాఫీ జార్ పట్టుకుని పంచెకట్టులో అదరగొట్టాడు. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవబోతోంది. రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. రామ్ లుక్ పై ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com