Ram Pothineni : మహేష్ బాబుతో రామ్ పోతినేని సందేశం
ఈ మధ్య వరుస ఫ్లాపులతో కెరీర్ లో చాలా డల్ అయిన రామ్ పోతినేని ఆగస్ట్ 15న డబుల్ ఇస్మార్ట్ మూవీతో వస్తున్నాడు. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇస్మార్ట్ శంకర్ కు రీమేక్. అయితే ఈ మూవీపై పూర్తిగా ఆశలు పెట్టుకోవాల్సిన పనిలేదు. పూరీ మూవీస్ అయితే హిట్ లేదంటే ఫట్ అంటున్నాయి. బట్ ఈ మూవీపై కాస్త అంచనాలైతే పెరిగాయనే చెప్పాలి. ఈ ప్రాజెక్ట్ తర్వాత ఓ యంగ్ డైరెక్టర్ తో మూవీకి కమిట్ అయ్యాడు రామ్.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో ఆకట్టుకున్న పి మహేష్ బాబు అనే దర్శకుడితో రామ్ నెక్ట్స్ మూవీ కన్ఫార్మ్ అయింది. ఈ మూవీకి సంబంధించి దర్శకుడు చాలా హైప్స్ ఇస్తున్నాడు. ఇప్పటి వరకూ రామ్ ఈ తరహా కథ చేయలేదంటున్నాడు. అంతే కాదు.. ప్రస్తుతం సమాజ తీరుకు అద్దం పడుతూ.. ఇక్కడ జరగాల్సిన అనేక మార్పుల గురించిన కథనం ఉంటుందట. రామ్ యువతరానికి ప్రతినిధిగా కనిపించబోతున్నాడట. ఇద్దరూ కలిసి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అందిస్తూనే సందేశాత్మక చిత్రంగానూ దీన్ని మలచబోతున్నారంటున్నారు. నిజానికి రామ్ ఈ తరహా కథలకు బాగా సూట్ అవుతాడు. అనవసరంగా స్కంద లాంటి లేనిపోని టెన్షన్స్ మీదేసుకునే కంటే ఇలాంటి సింపుల్ కంటెంట్స్ తో ఆడియన్స్ ముందుకు వస్తే ఇంకా బెటర్ గా షైన్ అవుతాడేమో. మరి ఈ కుర్రాళ్ల సందేశం ఎలా ఉంటుందో చూద్దాం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com