Ram Pothineni : సీనియర్ హీరోతో మల్టీస్టారర్ కు రంగం సిద్ధం !

Ram Pothineni : సీనియర్ హీరోతో మల్టీస్టారర్ కు రంగం సిద్ధం !
X

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ‘ఇస్మార్ట్ శంకర్‌’ మూవీతో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ సాధించాడు. ఈ హీరో అండ్ డైరెక్టర్ డ్యూయో .. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ‘డబుల్ ఇస్మార్ట్‌’ తో వస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండవ భాగం పై ఇప్పుడు బ్రహ్మాండమైన హైప్ క్రియేట్ అయింది. ఈ మాస్ యాక్షన్ డ్రామా ఆగస్టు 15 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో సందడి చేయబోతోంది.

అసలు మేటర్ లోకి వెళితే.. నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జోడీగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తెరకెక్కించిన దర్శకుడు మహేష్ బాబు పచ్చిగోళ్ల డైరెక్షన్ లో రామ్ పోతినేని ఒక సినిమా చేయబోతున్నట్టు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీగా నిర్మించబోతోంది.

ప్రస్తుతం ఈ సినిమాపై ఓ గాసిప్ టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. తాజాగా సమాచారం ప్రకారం ఓ సీనియర్ హీరో రామ్ పోతినేనితో స్ర్కీన్ షేర్ చేసుకోబోతున్నాడట. ఆ సీనియర్ హీరోది ఇంపాక్ట్ ఫుల్ రోల్ అని, అందుకే ఈ సినిమా మల్టీ స్టారర్ అవుతుందని అంటున్నారు. ప్రస్తుతానికి ఆ సీనియర్ హీరో ఎవరనేది క్లారిటీ లేదు. రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా కామెడీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కబోతోంది. నటీనటుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత, సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది.

Tags

Next Story