Ram Pothineni : హిట్ డైరెక్టర్ తో రామ్ పోతినేని

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనికి సరైన విజయం లేక చాలాకాలం అవుతోంది. తన వరకూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడుతున్నా.. ఎందుకో స్టోరీ సెలక్షన్ లో కాస్త తడబడుతున్నాడు. ప్రస్తుతం పి మహేష్ బాబు డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. రామ్ 22వ సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. మహేష్ బాబు దర్శకుడుగా ఫస్ట్ మూవీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో మెప్పించాడు. ఈ సారి ఓ రొమాంటిక్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.
ఈ మూవీ తర్వాత సితార బ్యానర్ లో రామ్ ఓ సినిమా చేయబోతున్నాడు అనే టాక్ బలంగా వినిపిస్తోంది. నాని సొంత బ్యానర్ లో ‘హిట్’మూవీ తో మొదలుపెట్టి ఫ్రాంఛైజీగా మార్చి ఇప్పుడు నానితో హిట్ 3 మూవీ చేస్తోన్న శైలేష్ కొలను డైరెక్షన్ లో రామ్ నటించబోతున్నాడు అంటున్నారు. ఇదో యాక్షన్ డ్రామాగా రూపొందుతుందట. రామ్ కు ఎప్పటి నుంచో మాస్ హీరోగా వెలిగిపోవాలని ఆశ. కానీ కథలు సెట్ కావడం లేదు. అందుకే గ్యాప్ ఇచ్చి మహేష్ బాబుతో ఓ క్లాస్ మూవీ చేస్తున్నాడు. ఆ వెంటన మళ్లీ మాస్ స్టోరీకే తన ఓటు అనేశాడు. మరి ఈ కాంబోకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే వస్తుందట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com