Varun Tej : మట్కా సాంగ్ .. రామా టాకీస్ దగ్గర రంగురాళ్లు అమ్మినోడా

వరుణ్ తేజ్ హీరోగా కరుణ కుమార్ రూపొందించిన సినిమా ‘మట్కా’. మీనాక్షి చౌదరి హీరోయిన్. నోరా ఫతేహి, సలోని, నవీన్ చంద్ర, కన్నడ కిశోర్, మైమ్ గోపి ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 14న విడుదల కాబోతోన్న ఈ మూవీ నుంచి లేటెస్ట్ గా మరో సాంగ్ విడుదల చేశారు. 1960ల కాలంలో సాగే కథగా రూపొందుతోన్న ఈ మూవీ నుంచి ఆ కాలానికి తగ్గట్టుగానే ఉన్న ఈ పాటను దర్శకుడు కరుణ కుమారే రాయడం విశేషం. జివి ప్రకాష్ కుమార్ సంగీతంలో సాయిదేవ హర్ష పాడాడు.
మనిషి తన సత్తాను తను నమ్ముకోవాలే కానీ.. రంగురాళ్లను నమ్ముకుంటే ఏం ఉపయోగం ఉండదనే అర్థంలో సాగుతుందీ పాట. ‘రామా టాకీస్ రోడ్డు కాడ రంగురాళ్లు అమ్మేవోడా.. రాతిలో ఏమున్నది.. నీ సేతిలో ఉన్నది పనితనము’.. అనే లైన్ తో మొదలై.. ఆ అల్లీ పురం మేడలో ఆకాసం రంగు చీర కట్టి హీరో కోసం ఎదురు చూస్తున్న హీరోయిన్ కోణం నుంచి సాగుతుంది.
ఈ పాటలోని ఆర్కెస్ట్రైజేషన్ చూస్తుంటే కొంత నోస్టాల్జిక్ గా అనిపిస్తుంది. ఎక్కువ శాతం హార్మోనియం, డోలక్ వాయిద్యాలనే వాడాడు జివి ప్రకాష్ కుమార్.
ట్రైలర్ తర్వాత మట్కాపై అంచనాలు పెరిగాయి. ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. కాకపోతే అదే రోజు సూర్య కంగువా కూడా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com