Ramajogayya Sastry: రామజోగయ్య శాస్త్రికి కోపం వచ్చింది.. ఇంతకీ ఏం జరిగింది..

Ramajogayya Sastry: అందరికీ అన్నీ నచ్చాలని లేదు.. ముందు మనకి నచ్చాలి. ఆ తరువాతే ఎవరికైనా.. అయినా డైరెక్టర్, హీరో ఓకే చేసిన తరువాత ఇంకేం ఉంటుంది అనుకోవడానికి. సాహిత్య పరిజ్ఞానం అందరికీ ఉంటుందనుకోవడం పొరపాటు. అందుకే కొందరికి నచ్చలేదు ఆయన జై బాలయ్య పాట.
దాంతో ఉందిగా ఏదైనా ఇష్టం వచ్చినట్లు రాసుకోవడానికి ఒక వేదిక. అందుకే రాసి పడేశారు. దాంతో ఆ పాట రాసిన రామజోగయ్య శాస్త్రిగారికి కోపం వచ్చింది. నేను ప్రతి పాటని ప్రాణం పెట్టి రాస్తాను. దయచేసి నన్ను, నా పాటని గౌరవించేవారు మాత్రమే నాతో ప్రయాణించండి.
జన్మనిచ్చిన అమ్మగారి గౌరవార్థం నా పేరును సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రిగా మార్చుకున్నాను. ఈ విషయంపై వేరే వాళ్లు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకేమైనా ఇబ్బంది ఉంటే ఇటు రాకండి అని ఆయన రాసుకొచ్చారు. మరి కొంత మంది సాహిత్యంపై పట్టు లేని వాళ్లు మాత్రమే ఇలాంటి కామెంట్లు చేస్తారు. వాటిని పట్టిందచుకోకండి అని శాస్త్రిగారికి మద్ధతు తెలియజేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com