'ఆదిపురుష్' ఎఫెక్ట్.. మళ్లీ టీవీల్లో కనువిందు చేయనున్న 'రామాయణం'

ఆదిపురుష్ ఎఫెక్ట్.. మళ్లీ టీవీల్లో కనువిందు చేయనున్న రామాయణం
X
కొన్ని పౌరాణిక గాధల గురించి ఎన్ని సార్లు విన్నా, చూసినా తనివి తీరదు.. మనసు పులకరించిపోతుంది.

కొన్ని పౌరాణిక గాధల గురించి ఎన్ని సార్లు విన్నా, చూసినా తనివి తీరదు.. మనసు పులకరించిపోతుంది. అటు సీరియల్స్ కానీ, ఇటు సినిమాలు కానీ కథలో మూలం చెడకుండా ఎంతో ప్రాణం పెట్టి ఆ చిత్రాలను చిత్రీకరిస్తారు.. అందుకే వాటికి అంత ఆదరణ లభిస్తుంది. రాముడంటే స్క్రీన్ మీద కనిపించే అతడే అని అనుకుంటారు. అంతగా మమేకం అవుతారు ఆ పాత్రలకు కనెక్ట్ అవుతారు..

కానీ ఓం రౌత్ తీసిన ఆదిపురుష్ సినిమా మొదటి నుంచి వివాదంలోనే ఉంది.. రిలీజ్ అయిన తరువాత మరింత వ్యతిరేకతను మూటగట్టుకుంది. అసలు ఇందులో ప్రభాస్ నటించేందుకు ఎలా ఒప్పుకున్నాడు అని ఫ్యాన్స్ తలపట్టుకున్నారు.. ఏది ఏమైనా ఒక చారిత్రక తప్పిదం జరిగినట్టుగా ఫీలైపోయిన జనాన్ని చల్లబరిచేందుకు 80లో రామానంద్ సాగర్ తీసిన రామాయణాన్ని మరోసారి టీవీల్లో ప్రసారం చేసేందుకు సిద్దమయ్యారు. ఇది కొంత ఊరటని ఇచ్చే అంశం. మళ్లీ ఆ భక్తిరస గాథను కనులారా వీక్షించేందుకు బుల్లితెర ప్రేక్షకులు ఉవ్విళ్లూరుతున్నారు.

మేకర్స్ 'రామాయణం' ప్రోమోను ఆవిష్కరించిన వెంటనే జై శ్రీరామ్ అంటూ ఓ అభిమాని వ్యాఖ్యానించారు. 'ఆదిపురుష' వివాదం మధ్య, 1980ల చివర్లో వచ్చిన ఐకానిక్ టెలిసీరియల్ 'రామాయణం' మళ్లీ ప్రసారం కానుంది. జూలై 3వ తేదీ రాత్రి 7:30 గంటలకు మీకు ఇష్టమైన ఛానెల్ #ShemarooTVలో మాత్రమే ప్రసారం కానుంది అని మేకర్స్ ప్రకటించారు.

ఈ ధారావాహికలో రాముడిగా అరుణ్ గోవిల్, సీతగా దీపికా చిఖిలియా, లక్ష్మణుడిగా సునీల్ లహ్రీ నటించారు. దారా సింగ్ హనుమంతునిగా మరియు అరవింద్ త్రివేది రావణునిగా చూపించారు. ఈ కార్యక్రమం వాస్తవానికి జనవరి 25, 1987 నుండి జూలై 31, 1988 వరకు ప్రసారం చేయబడింది. ప్రేక్షకుల నుండి భారీ స్పందనలను అందుకుంది. సోషల్ మీడియాలో ఇటీవల విడుదలైన ఓం రౌత్ యొక్క పాన్-ఇండియా చిత్రం 'ఆదిపురుష్'తో పోల్చిన సమయంలో షో తిరిగి టీవీ స్క్రీన్‌లపైకి వస్తున్నట్లు ప్రకటన వచ్చింది.

ఆదిపురుష్ గురించి మాట్లాడిన మేకర్స్.. ఈ చిత్రాన్ని వాల్మీకి రామాయణం ఆధారంగా రూపొందించాం అని చెప్పకండి, దానికి వేరే పేరు పెట్టండి. దీన్ని 'ఫాంటసీ' చిత్రంగా రూపొందించామని చెప్పుకోండి. అశేష ప్రజల మనోభావాలను మీరు దెబ్బ తీశారు. ప్రజలు దీన్ని భక్తితో చూస్తారు అని ఆదిపురుష్ పై విమర్శలు గుప్పించారు.

రామానంద్ సాగర్ యొక్క 'రామాయణం'లో లక్ష్మణ్‌గా నటించిన నటుడు సునీల్ లహరి మాట్లాడుతూ, "నేను సినిమా చూశాను. "చిత్రం చూసిన తర్వాత, దానిపై ఎలా స్పందించాలో నాకు అర్థం కాలేదు.

థియేటర్‌లో నా చుట్టూ కూర్చున్న వారు కూడా సినిమా చూసి సంతోషించలేదు. ఇద్దరు స్త్రీలు ఒకరికొకరు చెప్పుకుంటూ కూర్చున్నారు, ఎందుకు టైం వేస్ట్ వెళ్లిపోదాం అని అంటే.. మరో మహిళ 'ఏమీ లేకపోయినా విజువల్ ఎఫెక్ట్స్ చూద్దాం' అని చెప్పింది.

నా పక్కన కూర్చున్న ఓ వ్యక్తి తన స్నేహితుడికి 'రామాయణం పేరుతో ఏం చూపిస్తున్నారు?' అని మాట్లాడుకోవడం వినిపించింది. ఈ విధంగా ఆదిపురుష్ ఎన్నో విమర్శలను మూటగట్టుకుంది. పౌరాణిక ఇతిహాపాలను ఎంత జాగ్రత్తగా తీయాలో రాబోయే తరానికి నేర్పించినట్లైంది.

Tags

Next Story