Ramayana : రామాయణకు అది ప్లస్సా మైనస్సా.?

భారతీయ వెండితెరపై ఎన్నిసార్లు వచ్చినా బోర్ కొట్టని కావ్యం రామాయణం. తెలుగుతో పాటు చాలా భాషల్లో ఈ పురాణ గాథ వెండితెరపై సందడి చేసింది. అయితే తెలుగు వాళ్లంత గొప్పగా ఇప్పటి వరకూ ఎవరూ రామాయణాన్ని తీయలేదు అనే క్రెడిట్ కూడా మన వెటరన్ తెలుగు మేకర్స్ కు ఉంది. రెండేళ్ల క్రితమే ఆదిపురుష్ అంటూ రామాయణంలోని కొంత భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు బాలీవుడ్ మేకర్స్. అయితే ఈసారి పూర్తి స్థాయిలో సినిమాను రెండు భాగాలుగా తీసుకువస్తున్నారు. ఈ సారి నితేష్ తివారీ తెరకెక్కిస్తున్నాడు. మంచి కాస్టింగ్ కూడా కుదిరింది. రాముడుగా రణ్ బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడుగా యశ్, హనుమంతుడుగా సన్నీ డియోల్, లక్ష్మణుడుగా రవి దూబే, మండోదరిగా కాజల్ నటిస్తున్నారు. 4వేల కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ను 2026 దీపావళికి, సెకండ్ పార్ట్ 2027దీపావళికి విడుదల చేస్తాం అని గతంలోనే ప్రకటించారు. అయితే రామాయణం అనగానే మనకు మంచి పాటలు అనేది ఖచ్చితంగా ఎక్స్ పెక్ట్ చేసే అంశాల్లో ముందుంటుంది. బట్ ఈ బాలీవుడ్ రామాయణలో అసలు ఎలాంటి పాటలూ ఉండవట. రామాయణ గాథను చెప్పేలాంటి అనవసరపు పాటలేం ఉండవని.. డైరెక్ట్ గా కథనమే ఆకట్టుకునేలా ఉంటుందని.. అప్పుడప్పుడూ చిన్న చిన్న పాటలు వినిపిస్తాయి తప్ప రెగ్యులర్ సాంగ్స్ ఉండవని తేల్చి చెప్పారు మేకర్స్. మరి ఇది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది అప్పుడే చెప్పలేం కానీ.. ఈ తరంలో భక్తిని రంగరించిన పాటలకు మంచి క్రేజ్ అయితే ఉంది.
ఇక ఈ మూవీకి ఏఆర్ రహమాన్, హన్స్ జమీర్ సంగీతం అందిస్తున్నారు. అక్కడక్కడా వినిపించే లిరిక్స్ ను డాక్టర్ కుమార్ విశ్వాస్ రాస్తాడట.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com