Ranbeer Kapoor : బాలీవుడ్ రామాయణం.. దీపావళికి ఆగమనం

Ranbeer Kapoor :  బాలీవుడ్ రామాయణం.. దీపావళికి ఆగమనం
X

భారత పురాణాల నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి.. వస్తున్నాయి. ఆ ఇతిహాసాలను వెండితెరపై ఆవిష్కరించడం ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సబ్జెక్ట్స్ అవి. ఇప్పటికే దేశవ్యాప్తంగా రామాయణ గాథ నేపథ్యంలో అనేక సినిమాలు వచ్చాయి. అన్ని భాషల్లోకీ తెలుగు వాళ్లైతేనే పౌరాణికాలను అద్భుతంగా తీస్తారు అన్న పేరూ తెచ్చుకున్నారు మనవాళ్లు. ఆ మధ్య బాలీవుడ్ లో ఆదిపురుష్ అని తీస్తే అది కాస్తా అభాసుపాలైంది. ఇప్పుడు మరో సారి అక్కడి నుంచే రామాయణ గాథ వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది.

రణ్ బీర్ కపూర్ రాముడుగా, సాయి పల్లవి సీతగా ఈ చిత్రంలో దర్శనం ఇవ్వబోతున్నారు. కేజీఎఫ్ ఫేమ్ యశ్ రావణుడుగా నటిస్తూ.. నటిస్తూ నిర్మాణంలోనూ భాగస్వామిగా ఉన్నాడు. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. విశేషం ఏంటంటే.. రెండు భాగాల ట్రెండ్ రామాయణానికి ఆపాదించారు వాళ్లు. రామాయణ కథను రెండు భాగాలుగా చెప్పబోతున్నారు. ఫస్ట్ పార్ట్ ను 2026 దీపావళికి, రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేస్తాం అని ప్రకటించారు. అయితే ఈ మూవీ షూటింగ్ ఏ దశలో ఉంది. ఇతర కీలక పాత్రల్లో ఎవరు కనిపించబోతున్నారు అనే క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. మరి అంత గోప్యత ఎందుకో కానీ.. తెలుగు వెర్షన్ డైలాగ్స్ ను త్రివిక్రమ్ తో రాయించాలనుకుంటున్నారనే రూమర్ మాత్రం వినిపిస్తోంది.

Tags

Next Story