Bigg Boss Tamil 5 : తమిళ్ బిగ్ బాస్ కోసం రంగంలోకి ఫైర్ బ్రాండ్..!

Bigg Boss Tamil 5 : తమిళ్‌లో మొదలైన కొద్దిరోజులుకే బిగ్‌బాస్ షో నిర్వాహకులకి ఊహించని షాక్ ఎదురైంది.. అదే కమల్‌హాసన్ కి కరోనా సోకడం.. ఇటీవల అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన కమల్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీనితో పరీక్షలు చేయించుకోగా కరోనా అని తేలింది. ప్రస్తుతం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనితో మిగిలిన బిగ్‌బాస్ ఎపిసోడ్ లని ఎవరు హోస్ట్ చేయనున్నారన్నది పెద్ద సస్పెన్స్ గా మిగిలింది.
తాజాగా కమల్ కూతురు శ్రుతిహాసన్ హోస్ట్‌గా రానుందంటూ రకరకాలు వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం రమ్యకృష్ణ కొన్ని ఎపిసోడ్స్‌కి హోస్ట్‌గా వ్యవహరిస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే షో నిర్వాహకులు అమెను సంప్రదించగా ఆమె కూడా ఒకే చెప్పినట్టు సమాచారం. దీనిపైన విజయ్ టెలివిజన్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కాగా తెలుగులో నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ కోసం విదేశాలకి వెళ్ళినప్పుడు రమ్యకృష్ణ తెలుగు బిగ్ బాస్ షోని హ్యాండిల్ చేశారు. అప్పుడు ఆమె షో నడిపించిన విధానం అందర్నీ ఆకట్టుకుంది. దీనితో ఇప్పుడు తమిళ్ లో ఆమెని హోస్ట్ గా తీసుకొచ్చేందుకు నిర్వాహుకులు ఇంట్రెస్ట్ చూపించారట. ఇదిలావుండగా తన తండ్రి కమల్ హాసన్ కోలుకుంటున్నారని ఆయన కుమార్తె శ్రుతిహాసన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com