Ramya Krishnan: నటితో వివాదం.. బంపర్ ఆఫర్ వదిలేసుకున్న రమ్యకృష్ణ..

Ramya Krishnan (tv5news.in)
Ramya Krishnan: బిగ్ బాస్ రియాలిటీ షోకు తెలుగులోనే కాదు.. పలు భారతీయ భాషల్లో కూడా క్రేజ్ ఉంది. అందుకే సక్సెస్‌ఫుల్‌గా ఒకటి తర్వాత ఒకటి సీజన్లు ప్రారంభం అవుతూనే ఉన్నాయి. అయితే తాజాగా తమిళంలో బిగ్ బాస్ ఓటీటీ గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. దీని పేరే బిగ్ బాస్ అల్టిమేట్. అయితే దీనికి కమల్ హాసన్ హోస్ట్‌గా ఉండట్లేదని వెల్లడించాడు. అందుకే ఆయన ప్లేస్‌లో ఓ యంగ్ హీరో బిగ్ బాస్ అల్టిమేట్‌ను హోస్ట్ చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
బిగ్ బాస్ షో తెలుగుతో పాటు తమిళంలో కూడా దాదాపుగా ఒకే సమయంలో ప్రారంభం అయ్యింది. అప్పటినుండి బిగ్ బాస్ తమిళంకి కమల్ హాసనే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తెలుగులాగానే తమిళంలో కూడా బిగ్ బాస్ ఇప్పటివరకు అయిదు సీజన్లు పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ అల్టిమేట్ పేరుతో తాజాగా ఓటీటీ మొదటి సీజన్ కూడా ప్రారంభమయ్యింది. అయితే దీనికి కమల్ హోస్ట్‌గా ఉండను అని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
బిగ్ బాస్ సీజన్ 5 హోస్ట్ చేస్తున్న సమయంలోనే కమల్ హాసన్ కరోనా బారినపడ్డారు. అప్పుడు సీనియర్ నటి రమ్యకృష్ణ ఓ వారంపాటు బిగ్ బాస్ హోస్ట్‌గా వ్యవహరించింది. అయితే బిగ్ బాస్ అల్టీమేటంకు కూడా తానే హోస్ట్ అయితే బాగుంటుంది అనుకున్నారంతా. కానీ ఒక కంటెస్టెంట్ వల్ల రమ్యకృష్ణ హోస్ట్‌గా బాధ్యతలు తీసుకోవడానికి ఇష్టపడటం లేదని కోలీవుడ్ సర్కిల్స్‌లో టాక్.
బిగ్ బాస్ అల్టిమేట్‌లో వనితా విజయ్‌కుమార్ పార్టిసిపెంట్‌గా ఉంది. అయితే గతంలో వనితా విజయ్ కుమార్ పార్టిసిపెంట్‌గా, రమ్యకృష్ణ హోస్ట్‌గా బిగ్ బాస్ జోడిగల్ అనే ఓ షో ప్రారంభమయ్యింది. ఇందులో రమ్యకృష్ణకు, వనితా విజయ్ కుమార్‌కు మధ్య జరిగిన వాగ్వాదాం పెద్ద దుమారానికే దారితీసింది. అందుకే బిగ్ బాస్ అల్టిమేట్‌కు హోస్ట్‌గా రమ్యకృష్ణ కాకుండా యంగ్ హీరో శింబు వ్యవహరించనున్నట్టు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com