Cinema: స్నేహమంటే ఇదేరా..!వైరల్ అవుతున్న ఫొటోలు

Cinema: స్నేహమంటే ఇదేరా..!వైరల్ అవుతున్న ఫొటోలు
X
చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత కలిసిన రమ్య కృష్ణ - రోజా

సీనియర్ స్టార్ హీరోయిన్స్ రమ్యకృష్ణ- రోజా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో వీళ్ళు ‘ముగ్గురు మొనగాళ్లు’ ‘సమ్మక్క సారక్క’ వంటి చిత్రాల్లో కలిసి నటించి ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. రీసెంట్ టైమ్స్ లో మాత్రం వీరు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఎక్కువగా రమ్యకృష్ణ కేవలం సినిమాలపైనే ఫోకస్ చేయగా.. రోజా మాత్రం మొన్నటివరకూ బుల్లితెరల్లో కనిపించింది. ఇప్పుడు రాజకీయాల్లో కనసాగుతోంది. ఇక రమ్యకృష్ణ విషయానికొస్తే ‘బాహుబలి’ తో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ఇలా వారిద్దరి ఎవరి రేంజ్ లో వాళ్లు తమ కెరీర్ లో దూసుకుపోతున్నాయి. అయితే ఈ కాలంలో రోజా, రమ్యకృష్ణ కలిసి కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. తాజాగా వీరిద్దరూ కలవడం సినీ ప్రేమికుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దాదాపు 23 ఏళ్ళ తర్వాత రమ్యకృష్ణ, రోజా కలిశారని.. ప్రస్తుతం సోషల్ మీడియాలో డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. కానీ మధ్య మధ్యలో వీళ్ళు చాలా సార్లు కలిసి కనిపించినట్టు కూడా కొందరు అంటున్నారు.

తన ఇంటికి వచ్చిన రమ్యకృష్ణకి రోజా బొట్టు పెట్టి, చీర ఇచ్చి సాగనంపింది. ఈ సందర్భంగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో పలు ఫోటోలను కూడా షేర్ చేసింది. “మంచి స్నేహితులు నక్షత్రాల లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని రోజూ చూడలేరు. కానీ, మీ కోసం వాళ్ళు ఎప్పుడూ నిలబడతారు. అది మీకు తెలుస్తుంది. ఈరోజు మా ఇంటికి వచ్చి, నాకెంతో సంతోషాన్ని అందించిన నా నక్షత్రానికి హృదయపూర్వక స్వాగతం. మేమిద్దరం కలుసుకున్నప్పుడు ఆ రోజుల్లో ‘మా జీవితం ఎలా ఉండేదో, ఒకప్పటి మా నవ్వులు ఎలా ఉండేవి’ అనేవి గుర్తొచ్చాయంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు రోజా.

మేమిద్దరం కలుసుకుని ఎన్నాళ్లు అయ్యిందనేది ముఖ్యం కాదు. నా స్నేహితురాలు రమ్యకృష్ణను కలిసినప్పుడు మళ్ళీ నా మొహం పై కనిపించే చిరునవ్వు, నాకు కలిగే ఆనందమే నాకు ముఖ్యం. ఆమె ఎప్పుడూ ఓ అద్భుతమే’ అంటూ రాసుకొచ్చింది రోజా. ఈ క్యాప్షన్ తో పాటు ఆమె షేర్ చేసిన ఫొటోలు, వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రమ్యకృష్ణ తమిళనాడుకు చెందిన వారు అయినప్పటికీ తెలుగు వాడైన కృష్ణవంశీని వివాహం చేసుకుంది. ఇక రోజా విషయానికొస్తే.. తమిళ దర్శకుడైన సెల్వమణిని పెళ్లి చేసుకుంది.

పలు సినిమాలలో కలిసి నటించిన ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లు.. తాజా సంఘటనతో ఆఫ్ స్క్రీన్‌లో గొప్ప బంధాన్ని కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. ఇద్దరూ కూడా మంచి స్నేహితులు కొనసాగుతూ తమ రంగాల్లో విజయ పతాకాన్ని ఎగరేస్తున్నారు. ఈ రీయూనియన్‌కి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా.. ఇన్నేళ్ల తర్వాత కూడా వీరి కలయికను, వారి మధ్య ఉన్న స్నేహాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.



Tags

Next Story