Manchu Vishnu: 'భీమ్లా నాయక్'లో ఆ పాత్రకు ఫస్ట్ ఛాయిస్ మంచు విష్ణు..!

Manchu Vishnu: భీమ్లా నాయక్లో ఆ పాత్రకు ఫస్ట్ ఛాయిస్ మంచు విష్ణు..!
Manchu Vishnu: భీమ్లా నాయక్ సినిమా రీమేకే అయినా కూడా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

Manchu Vishnu: ముందుగా ఒకరి కోసం రాసుకున్న కథ మరొకరి చేతికి వెళ్లడం సాధారణ విషయమే. దర్శకుడు ఒక నటుడిని దృష్టిలో పెట్టుకొని ఓ కథ రాసినా కూడా అది అనుకోని పరిస్థితుల్లో వేరేవారి చేతిలోకి వెళ్తుంటుంది. అలాగే బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన 'భీమ్లా నాయక్' చిత్రంలోని ఓ పాత్ర కోసం ముందుగా మంచు విష్ణును అనుకున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మంచు విష్ణు ప్రస్తుతం సినిమాలు చేయడంలో స్పీడ్ తగ్గించాడు. మా ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత ప్రస్తుతం మా అధ్యక్షుడిగానే బిజీ అయిపోయాడు. ప్రస్తుతం తన అప్‌కమింగ్ సినిమాల గురించి ఎలాంటి అప్డేట్ లేదు. అయితే మా ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో విష్ణుకు భీమ్లా నాయక్ ఆఫర్ వచ్చిందని అందుకే తను రిజెక్ట్ చేశాడని టాలీవుడ్ సర్కి్ల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

భీమ్లా నాయక్ సినిమా రీమేకే అయినా కూడా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మొదటిరోజు నుండే ఈ చిత్రం భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. అయితే టీజర్, ట్రైలర్ చూసి ఇందులో పవన్ కళ్యాణ్ పాత్రకు సమానంగా రానా పాత్ర లేదేమో అనుకున్నారంతా. కానీ మూవీ చూశాక రెండు పాత్రలకు సమానంగా ప్రాధాన్యత ఉందని అర్థమయ్యింది.

డ్యానియల్ శేఖర్‌గా రానా తన నటవిశ్వరూపాన్ని కనబరిచాడు. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా భీమ్లా నాయక్‌లో రానా యాక్టింగ్ చూసిన తర్వాత తనకు ఫ్యాన్స్ అయిపోయారు. అయితే ఈ డ్యానియల్ శేఖర్ పాత్ర కోసం ముందుగా మంచు విష్ణును సంప్రదించిందట మూవీ టీమ్. కానీ అనుకోకుండా సీన్‌లోకి రానా ఎంటర్ అయ్యాడు. భీమ్లా నాయక్ చూసిన తర్వాత డ్యానియల్ శేఖర్‌గా రానాను తప్ప మరొకరిని ఊహించుకోలేకపోతున్నారు ప్రేక్షకులు.

Tags

Read MoreRead Less
Next Story