Samantha: సమంత తీసుకున్న సంచలన నిర్ణయానికి ఆ హీరోనే కారణం..

Samantha: కొన్ని పాత్రలు చేయాలంటే ఎన్ని గట్స్ ఉండాలి.. టాప్ హీరోయిన్ అయినంత మాత్రాన అన్ని పాత్రలకు ఓకే చెప్తుందనుకుంటే ఎలా.. అయినా ఆ పాత్రకు ఆమె అయితేనే కరెక్ట్ అని భావించాడు రానా.. అందుకే ఆమెని సజెస్ట్ చేశాడు.
'అరేంజ్‌మెంట్ ఆఫ్ లవ్' అనే హాలీవుడ్ మూవీకి తెలుగులో హీరోయిన్ ఎవరైతే బావుంటుందని మేకర్స్ ఎంక్వైరీ చేస్తున్న తరుణంలో హీరో రానా సమంత అయింతే ఆ పాత్రకు సరిగ్గా సరిపోతుందని అన్నాడట. దాంతో మేకర్స్ సమంతని సంప్రదించి ఆమెకు కథ వినిపించారట.
ఆమెకు తన పాత్ర నచ్చడంతో ఆ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. త్వరలో ప్రారంభ కానున్న ఈ సినిమా కథని భారత రచయిత తిమేరి ఎన్ మురారీ రచించిన 'అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్' నవల ఆధారంగా తెరకెక్కుతోంది.
గురు ఫిల్మ్స్ పతాకంపై సునీత తాటి నిర్మిస్తుండగా ఫిలిప్ జాన్ దర్శకత్వం వహిస్తున్నారు. 'సూపర్ డీలక్స్', 'ఫ్యామిలీ మ్యాన్-2' చిత్రాల్లో సమంత బోల్డ్ రోల్స్‌లో కనిపించి ప్రేక్షకులను మెప్పించిన సామ్ ఇందులోనూ తనదైన నట విశ్వరూపాన్ని ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనడంలో అతిశయోక్తి లేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com