VirataParvam : విరాటపర్వం రిలీజ్ డేట్ వచ్చేసింది

VirataParvam : ఎట్టకేలకు విరాటపర్వం రిలీజ్ డేట్ వచ్చేసింది. రానా దగ్గుబాటి, సాయి పల్లవి మెయిన్ లీడ్ లో తెరకెక్కిన ఈ సినిమాని జూలై 1న రిలీజ్ చేస్తున్నట్టుగా దర్శకుడు వేణు ఉడుగుల వెల్లడించాడు.
"తెలుగు నేల నడిచిన కొత్త దారుల నెత్తుటి జ్ఞాపకం... మనలోంచి మన కోసం సాగిన ఓ చారిత్రక సందర్బం... ప్రేమ యుద్ధమై సాగిన విరాటపర్వం.. జులై ఒకటవ తేదీన మీ ముందుకు" అని ట్వీట్ చేశాడు. కాగా ఈ సినిమాలో ప్రియమణి ఓ కీలకపాత్ర పోషించారు.
దగ్గుబాటి సురేశ్ బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి ఈ సినిమాకి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. షూటింగ్ పార్ట్ ఎప్పుడో కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పలుమార్లు వాయిదా పడింది. ప్రేక్షకుల్లో ఈ సినిమా పైన భారీ అంచనాలే ఉన్నాయి.
తెలుగు నేల నడిచిన కొత్త దారుల నెత్తుటి జ్ఞాపకం
— v e n u u d u g u l a (@venuudugulafilm) May 6, 2022
మనలోంచి మన కోసం సాగిన ఓ చారిత్రక సందర్బం .
ప్రేమ యుద్ధమై సాగిన విరాటపర్వం . జులై ఒకటవ తేదీన మీ ముందుకు .... @RanaDaggubati @Sai_Pallavi92 @venuudugulafilm #SureshBobbili @dancinemaniac @laharimusic @SureshProdns @SLVCinemasOffl pic.twitter.com/Gy1OlGmL3y
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com