Venkatesh : రానా నాయుడు మరో సీజన్ వస్తోందా..

వెంకటేష్, రానా కలిసి నటించిన ఫస్ట్ వెబ్ సిరీస్ రానా నాయుడు. ఈ ఇద్దరి ఇమేజ్ కు పూర్తి భిన్నమైన కంటెంట్ తో రూపొందిన ఈసిరీస్ కు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచ స్పందన రాలేదు. అందుకు కారణం వెంకీ ఇమేజ్. ఫ్యామిలీ హీరో అన్న ఇమేజ్ ఉన్న వెంకటేష్ ఈసిరీస్ లో విపరీతమైన బూతులు వాడాడు. అడల్ట్ సీన్స్ చేశాడు. అది చాలామందికి నచ్చలేదు. కానీ ఆయన మాత్రం దాన్నో పాత్రగానే చూశా అని చెప్పుకున్నాడు. ముఖ్యంగా బయట కూడా వరసకు తండ్రి కొడుకులైన రానా, వెంకీ మధ్య సీన్స్ తెలుగువాళ్లకు నచ్చలేదు. కానీ ఇతర భాషల వాళ్లుఎంజాయ్ చేశారు. అందుకే నెట్ ఫ్లిక్స్ స్ట్రీమ్ అయిన ఈ సిరీస్ కు ఇప్పుడు కొనసాగింపుగా మరో సీజన్ రాబోతోంది.
రానా నాయుడును కరణ్ అన్షుమాన్, సుపర్న్ వర్మ కలిసి డైరెక్ట్ చేశారు. సెకండ్ సీజన్ ను కూడా వారే డైరెక్ట్ చేయబోతున్నారు. అయితే ఈ సారి బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తాడట. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ నుంచి ఓ అఫిషియల్ టీజర్ ను విడుదల చేశారు. తెలుగువారికి నచ్చనంత మాత్రాన కొన్ని విషయాలు అందరికీ నచ్చవు అనుకోవడానికి లేదు అనేందుకు రానా నాయుడు వెబ్ సిరీస్ ఓ ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. మరి ఈ సారి అడల్ట్ డోస్ ఇంకా పెంచుతారా లేక తగ్గిస్తారా అనేది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com