Vijay and Rashmik : నవ దంపతులకు రణబాలి స్పెషల్ గిఫ్ట్

Vijay and Rashmik :  నవ దంపతులకు రణబాలి స్పెషల్ గిఫ్ట్
X

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా నవ దంపతులుగా వెలిగిపోతున్నారు. వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లైన వెంటనే హైదరాబాద్ కు వచ్చిందీ జంట. మార్చి 4న రిసెప్షన్ ఏర్పాట్లలో ఉన్నారు. అయితే ఈ ఇద్దరి దంపతులకు రణబాలి మూవీ నుంచి ఓ స్పెషల్ గిఫ్ట్ విడుదల చేసింది. రాహుల్ సాంకృత్యన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. పీరియాడిక్ మూవీగా రూపొందుతోందీ మూవీ. అయితే ఈ మూవీలో కూడా ఓ పెళ్లి సీన్ ఉంది. ఆ పెళ్లి సీన్ తో పాటు చిన్న పాటను కూడా రణబాలి టీమ్ విడుదల చేసింది. అంటే ఈ ఇద్దరి పెళ్లి గిఫ్ట్ గా దీన్ని భావించాలేమో. అయితే ఈ గిఫ్ట్ లో విజయ్ దేవరకొండ పెళ్లిలో సీరియస్ గా కనిపిస్తున్నాడు. అతనో మిషన్ పైనే ఉన్నవాడుగా కనిపిస్తుంటాడు. రష్మిక మాత్రం అంతా కొత్తగా ఉన్నట్టు తమ పెళ్లి గురించి కనిపిస్తోంది. విజయ్ ఓ గుర్రాన్ని కడగడం, రష్మిక చాటలో బియ్యం చూసుకుంటూ ఉంటోంది. ఈ టైమ్ లో వీరి మధ్య ఓ చిన్న పాట కూడా ఉంది.

‘ఏందయ్యా సామి ఇట్ట గాస్తాందీ ఎన్నెల .. ఊపేస్తాందీ చిత్తరాల ఉయ్యాలా.. ’ అంటూ సాగే పాట ఇది. చాలా సింపుల్ గా మెలోడియస్ గా ఉందీ పాట. వీళ్లిద్దరి మధ్య గొప్ప అనుబంధం ఉన్నట్టుగా ఉందీ పాటలో. పాట ఒరిజినల్ గా ఉన్నట్టుగా కనిపిస్తున్నా.. నిజంగానే వీరి మధ్య అనుబంధం చాలా గొప్పగా ఉండబోతోందీ వీరి పెళ్లితో అన్నట్టుగా ఉంది.

ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న మూవీ ఇది. మరాఠీ మ్యూజిక్ డైరెక్టర్స్ అయిన అజయ్ - అతుల్ ద్వయం సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ పాటతోనే వీరి రేంజ్ ఏంటో తెలిసిపోతుంది. ఇక ఈ మూవీని ఈ యేడాది సెప్టెంబర్ 11న విడుదల చేయబోతున్నట్టు కూడా చెప్పేశారు. మొత్తంగా ఈ నవ దంపతులకు ఈ మూవీ టీమ్ అందించిన ఈ గిఫ్ట్ బ్యూటీఫుల్ గానే ఉందని చెప్పాలి.

Tags

Next Story