Ranbir Alia: రణభీర్, ఆలియా వెడ్డింగ్ డేట్ ఫిక్స్.. పెళ్లి షాపింగ్ మొదలు..

Ranbir Alia: రణభీర్, ఆలియా వెడ్డింగ్ డేట్ ఫిక్స్.. పెళ్లి షాపింగ్ మొదలు..
Ranbir Alia: 2022 మొదట్లోనే రణభీర్ కపూర్, ఆలియా భట్ పెళ్లి గురించి వార్తలు వచ్చాయి.

Ranbir Alia: లాక్‌డౌన్ సమయంలో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు పెళ్లి పీటలెక్కారు. వారిలో ఎక్కువశాతం బాలీవుడ్‌కు చెందినవారే ఉన్నారు. అయితే ప్రస్తుతం బాలీవుడ్ ప్రేక్షకుల చూపు మొత్తం రణభీర్ కపూర్, ఆలియా భట్‌పైనే ఉంది. ఈ లవ్ బర్డ్స్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే వీరి పెళ్లికి ముహూర్తం ఖరారు అయినట్టు బీ టౌన్‌లో టాక్ నడుస్తోంది.

2022 మొదట్లోనే రణభీర్ కపూర్, ఆలియా భట్ పెళ్లి గురించి వార్తలు వచ్చాయి. వీరిద్దరు కచ్చితంగా ఈ సంవత్సరంలోనే పెళ్లి చేసుకుంటారని కొందరు సన్నిహితులు కూడా ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరు కలిసి 'బ్రహ్మాస్త్ర' సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ కోసం వెళ్లిన ప్రతీసారి వీరిద్దరికి పెళ్లి గురించే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాజాగా ఈ ప్రశ్నలకు ఓ సమాధానం దొరికేసిందంటున్నారు బాలీవుడ్ ప్రేక్షకులు.

ఏప్రిల్‌లో రణభీర్, ఆలియాల పెళ్లి ఖాయం అయినట్టు సమాచారం. అందుకే రణభీర్ కపూర్ తల్లి నీతూ కపూర్ ఇప్పటికే పెళ్లి దుస్తుల కోసం మనీష్ మల్హోత్రాను సంప్రదించిందట. అంతే కాకుండా రణభీర్, ఆలియా కూడా వారి షూటింగ్స్ నుండి బ్రేక్ తీసుకునే ఆలోచనలో ఉన్నారట. అయితే ముందుగా అక్టోబర్‌లో వీరి పెళ్లి జరుగుతుంది అనుకున్నారంతా కానీ అది ఏప్రిల్‌కే ప్రీపోన్ అవ్వడం తమ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story