Animal : ఇది అడల్ట్ రేటెడ్ ఖుషీ కభీ కభీ ఘమ్ : రణబీర్ కపూర్

Animal : ఇది అడల్ట్ రేటెడ్ ఖుషీ కభీ కభీ ఘమ్ : రణబీర్ కపూర్
'యానిమల్' మూవీ ఎలా ఉంటుందో చెప్పిన బాలీవుడ్ యాక్టర్ రణబీర్ కపూర్

నటుడు రణబీర్ కపూర్‌తో పాటు బాబీ డియోల్, రష్మిక మందన్న, నిర్మాత భూషణ్ కుమార్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న తమ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'యానిమల్' ట్రైలర్ లాంఛ్ కోసం న్యూఢిల్లీకి చేరుకున్నారు. 3 నిమిషాల 32 సెకన్ల పాటు సాగే ఈ ట్రైలర్ లో రణబీర్ చిన్న వయస్సులో హింసాత్మకంగా పెరిగిన కారణంగా అతని పాత్ర భయంకరంగా మారిందని సూచించింది. రణ్‌బీర్ పాత్ర తన తండ్రి ప్రేమకు రక్షణగా, అబ్సెసివ్‌గా ఉంటుంది. తన తండ్రిపై ప్రేమకు అడ్డుగా వచ్చిన ప్రతి ఒక్కరినీ బెదిరిస్తూ కనిపిస్తాడు.

ఈ సినిమా 3 గంటల 21 నిమిషాల నిడివితో ఉన్నట్లు సమాచారం. అయితే 'యానిమల్' ట్రైలర్ లాంచ్‌లో మీడియాతో మాట్లాడిన రణబీర్.. ఈ చిత్రం సుదీర్ఘ వ్యవధి గురించి, తండ్రి, కొడుకుల మధ్య బంధం నేపథ్యం గురించి చమత్కరిస్తూ.. "ఇది అడల్ట్ రేటెడ్ ఖుషీ కభీ కభీ ఘమ్" అని అన్నారు. రణబీర్ పాత్ర చాలా హింసాత్మకంగా ఉన్నప్పటికీ, షూట్ పూర్తయిన తర్వాత అతను ఎప్పుడూ తన పాత్ర నుండి విడిపోయేవాడని వెల్లడించాడు. "నేను నిర్లిప్త వ్యక్తిని. నేను నా పాత్రను ఎప్పుడూ ఇంటి వరకూ తీసుకెళ్లను. నా ప్రియమైన వారికి ఇది సరైంది కాదు. నేను వెళ్లి ఈ వ్యక్తిలా ప్రవర్తిస్తే, నా భార్య నన్ను కొడుతుంది” అని ఆయన నవ్వుతూ చెప్పాడు.

ఇక సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన 'యానిమల్' లో అనిల్ కపూర్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్‌గా నటిస్తుండగా, ట్రయిలర్‌లో స్టైలిష్ అండ్ భయంకరమైన రూపాన్ని కలిగి ఉన్న రష్మిక మందన్న రణ్‌బీర్‌కు ప్రేమగా ఉంటుందని ట్రైలర్ వెల్లడించింది. 'యానిమల్' డిసెంబర్ 1న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం అనే 5 భాషలలో విడుదల కానుంది. విక్కీ కౌశల్ రాబోయే చిత్రం 'సామ్ బహదూర్'తో 'యానిమల్' పెద్ద బాలీవుడ్ క్లాష్ ను ఎదుర్కొనబోతోంది.


Tags

Read MoreRead Less
Next Story