Patek Philippe Watch : రణబీర్ చేతికున్న వాచ్ ఎంతంటే..

Patek Philippe Watch : రణబీర్ చేతికున్న వాచ్ ఎంతంటే..
X
బీనీ క్యాప్, ఖరీదైన టైమ్‌పీస్‌ల నుండి అతని స్నీకర్ల వరకు ఫ్యాషన్ ను ఫాలో అవుతూ వార్తల్లో నిలుస్తోన్న రణబీర్ కపూర్

ప్రముఖ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ తన ఫ్యాషన్ ఎంపికలకు ప్రత్యేకించి స్నీకర్ల సేకరణకు ప్రసిద్ధి చెందాడు. ఫ్యాషన్ సెన్స్ ఎల్లప్పుడూ ప్రశంసించబడే భారతదేశంలోని ప్రముఖ నటులలో ఆయన ఒకడు. అంతే కాదు రణబీర్ ఫ్యాషన్ కలెక్షన్ ను అభిమానులు కూడా ఎంతో ఇష్టపడతారు. అతని దుస్తులు ఎంత పెట్టి కొన్నాడు, అవి ఎలా ఉన్నాయి.. ఏ పట్టణంలో కొన్నాడంటూ చర్చిస్తూ ఉంటారు.

బీనీ క్యాప్, ఖరీదైన టైమ్‌పీస్‌ల నుండి అతని స్నీకర్ల వరకు, రణబీర్ తన ఫ్యాషన్ ఎంపికల కోసం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. తాజాగా, అతను చాలా ఖరీదైన 'పాటెక్ ఫిలిప్' వాచ్ ధరించి కనిపించాడు. ఆయన పటేక్ ఫిలిపీ ఆక్వానాట్ సెల్ఫ్-వైండింగ్ వాచ్‌ని కలిగి ఉన్నాడు. అయితే ఈ వాచ్ అభిమానుల్ని ఎంతగానో ఆకర్షిస్తోంది. ఇంతకీ దీని ధర ఎంతనుకున్నారు.. అక్షరాల రూ.72.6లక్షలు.

ఇక రణబీర్ కపూర్ సినిమా విషయాలకొస్తే.. ఆయన తదుపరి సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రాబోతున్న 'యానిమల్'లో కనిపించనున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 1, 2023న విడుదల కానుంది. ఇందులో అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, త్రిప్తి దిమ్రీ కూడా నటించారు. ఇక ఈ మూవీ విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ వేగం పెంచారు. ముఖ్యంగా తెలుగులో భారీ ఎత్తున ప్రమోషన్లు చేస్తున్నారు. ‘యానిమల్’ తెలుగు ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా సందీప్ రెడ్డి వంగా, రష్మికలతో పాటు రణ్‌బీర్ కపూర్ లు బాల‌కృష్ణ‌ అన్‌స్టాపబుల్ షోకు రాబోతున్నారు. ఈ అన్‍స్టాపబుల్ పాన్ ఇండియా ఎపిసోడ్‌ను ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ ఆహాలో నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్ కానున్న‌ట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది.

Tags

Next Story