Hyderabad Event : రణబీర్ ధరించిన ఈ స్వెడ్ బాంబర్ జాకెట్ ధరెంతో తెలుసా..
బాలీవుడ్ హార్ట్‌త్రోబ్ రణబీర్ కపూర్ ప్రస్తుతం తన భారీ అంచనాల చిత్రం 'యానిమల్' విడుదలకు సిద్ధమవుతూ సంచలనం సృష్టిస్తున్నాడు. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నాడు. నటి రష్మిక మందన్న ఈ మూవీలో రణబీర్ కు జోడీగా, హీరోయిన్ గా నటిస్తోంది.
నవంబర్ 27న హైదరాబాద్‌లో జరిగిన గ్రాండ్ ప్రమోషనల్ ఈవెంట్‌లో, బాలీవుడ్, తెలుగు సినీ ప్రముఖులతో వేదికను పంచుకున్న తారలతో నిండిపోయింది. దిగ్గజ దర్శకుడు SS రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన తారలు రణబీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్, నిర్మాత భూషణ్ కుమార్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగాలతో కలిసిపోయారు. రణబీర్ కపూర్ తన డాషింగ్ అండ్ హ్యాండ్సమ్ అప్పియరెన్స్‌తో ఈవెంట్‌లో దృష్టిని ఆకర్షించాడు. మస్టర్డ్-కలర్ ప్రాడా బ్లేజర్ ధరించి, అతను తన కూల్ లుక్ కోసం ప్రశంసలు పొందాడు. అయితే, ఇది చాలా మంది దృష్టిని ఆకర్షించింది. అతని స్వెడ్ బాంబర్ జాకెట్ ధర ఇప్పుడు ట్రెండింగ్ లో నిలుస్తోంది. తాజాగా దీని ధర రూ. 4.35 లక్షలు అని ఓ ఇన్ స్టా పేజీ రివీల్ చేసింది.
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ ‘యానిమల్’ విడుదలకు రెడీ అవుతోంది. డిసెంబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. హీరో రణబీర్ కపూర్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాపై అంచనాలను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమాతో పాటు తన వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పనిలో పనిగా తన భార్య ఆలియా భట్ మీద ఆయన ప్రశంసల జల్లు కురిపించారు.
‘యానిమల్’ ఈ సినిమా షూటింగ్ సమయంలో తన భార్య ఆలియా నుంచి చాలా సపోర్టు లభించిందని రణబీర్ కపూర్ తెలిపారు. కొన్ని సన్నివేశాల విషయంలో నటుడిగా తనకు చాలా భయం కలిగిందని చెప్పారు. ఆ భయాన్ని దూరం చేయడంలో ఆలియా సాయపడిందన్నారు. “ఆలియా, నేను మా సినిమాల గురించి నిత్యం మాట్లాడుకుంటాం. నటిగా ఆమెను ఎంతో గౌరవిస్తాను. ఆమె ఆలోచించే విధానం కూడా చాలా మెచూర్డ్ గా ఉంటుంది. సినిమా షూటింగ్ కు వెళ్లే సమయంలో ఆమె చర్చిస్తాను. ఆయా సన్నివేశాల్లో ఎలా నటించాలో తను కీలక సూచలను అందిస్తుంది. ఒక నటుడిగా నేను భయపడిన సన్నివేశాల్లోనూ ఆమె అందించిన సపోర్టును మర్చిపోలేను. ‘యానిమల్’ లాంటి ఇంటెన్స్ సినిమా నేను గతంలో ఎప్పుడూ చేయలేదు. నేను ఎప్పుడూ స్క్రీన్ మీద మంచి తనాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నించాను. కానీ, ఇప్పుడు పూర్తి విరుద్ధమైన క్యారెక్టర్ చేశాను. ఈ క్యారెక్టర్ చేసేందుకు ఆలియా అన్ని విధాలుగా నన్ను ప్రోత్సహించింది. ఈ సినిమా విషయంలో ఆమె బలమైన మద్దతునిచ్చింది” అని వెల్లడించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com