Anasuya : రంగమ్మత్త ఆటవిక సందేశం

Anasuya : రంగమ్మత్త ఆటవిక సందేశం
X

తెలుగు బుల్లితెర చరిత్రలో కంటెంట్ తో కంటే కాస్ట్యూమ్స్ షోస్ ను హీటెక్కించిన ఫస్ట్ బ్యూటీ అనసూయ. అందం, ప్రతిభతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయినా అందాల ప్రదర్శన విషయంలో అనేక కామెంట్స్ ను కూడా ఫేస్ చేస్తూ వస్తోంది. అయినా డోంట్ కేర్ అనే మెంటాలిటీతోనే కనిపిస్తుంది. బుల్లితెర నుంచి వెండితెర వరకూ వచ్చి ప్రాధాన్యత ఉన్న పాత్రలతో ఆకట్టుకుంటోంది. కొన్నాళ్ల క్రితం రంగస్థలంలో చేసిన రంగమ్మత్త అనే పాత్ర ఆమె కెరీర్లోనే ఓ మైల్ స్టోన్. యాక్టింగ్ లో టాలెంట్ చూపించినా యాటిట్యూడ్ తో వివాదాలు తెచ్చుకోవడం కూడా బాగా అలవాటు అనసూయకు. ఎప్పుడూ అందరి అటెన్షన్ తనపైనే ఉండేలా చూసుకోవడంలో ఎక్స్ పర్ట్.

ఇవన్నీ పక్కనబెడితే అనసూయ ఇప్పుడు సింబా అనే సినిమాతో వస్తోంది. కృష్ణ సౌరభ్ నిర్మించిన ఈ మూవీని మురళీ మనోహన్ డైరెక్ట్ చేశాడు. ఆగస్ట్ 9న విడుదల కాబోతోంది. జగపతి బాబు, కస్తూరి, గౌతమి, వశిష్ట సింహా కీలక పాత్రల్లో నటించారు. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ లో టెక్నికల్ గా పెద్ద క్వాలిటీ కనిపించడం లేదు. ముఖ్యంగా అనసూయ పాత్ర ఓవర్ ద బోర్డ్ అనేలా ఉంది. ఓ స్కూల్ టీచర్ గా పనిచేసే ఆవిడ కొందరిని చంపుతూ ఉంటుంది. కారణం ఏంట్రా అంటే వాళ్లంతా పర్యావరణాన్ని పాడు చేస్తున్నారు. అడవులను ధ్వంసం చేస్తున్నారు అంటూ మరోవైపు నుంచి జగపతిబాబు ఉపన్యాసాలు కనిపిస్తున్నాయి. ఇక గౌతమి పాత్ర డల్ గా కనిపిస్తోంది. ఇలా పర్యావరణంపై వచ్చిన సినిమాలేవీ ఈ మధ్య కాలంలో పెద్దగా ఆకట్టుకోలేదు. పైగా అనసూయ చీరకట్టులో ఒకప్పటి విజయశాంతిలా ఫైటింగ్ లు చేస్తుటే చూడ్డానికి కామెడీగా ఉంది. అస్సలే మాత్రం ఆకట్టుకునేలా ఉందీ ట్రైలర్. చూస్తుంటే వీళ్లు అడవులను ధ్వంసం చేయొద్దు, ప్రకృతిని కాపాడుకుందాం.. అనే సందేశాలు ఇవ్వబోతున్నారు అనేలా ఉంది. ఇలాంటివి మెసేజ్ లు చేస్తే సరిపోతుంది అనే ఎరాలో ఉన్న టైమ్ లో సినిమాలు చేస్తే చూస్తారా.. అందుకే ఇది కేవలం సందేశాత్మక సినిమా మాత్రమే కాదు.. సూపర్ నేచురల్ సైకలాజికల్ థ్రిల్లర్ అంటున్నారు. దీనికోసం సినిమా దాకా ఎందుకు..? కొందరు దుండగుల దాడిలో చనిపోయిన ఓ ఫారెస్ట్ ఆఫీసర్ ఆత్మ అనసూయలో ప్రవేశిస్తుంది. అప్పటి నుంచి ఈమె ద్వారా అతను రివెంజ్ తీర్చుకుంటాడు. ఇంతే. ఇంక థ్రిల్ ఏముంటుందో. మొత్తంగా అడవులను కాపాడాలని వాటిని ధ్వంసం చేస్తున్న వారిని ఆటవికంగా సంహారిస్తూ రంగమ్మత్త ఆటవిక న్యాయం చేయబోతోందన్నమాట. ఏదేమైనా.. అనసూయ కొన్నాళ్లుగా సినిమా సినిమాకూ బోరింగ్ గా మారుతుందేమో కదా..?

మొత్తంగా ఈ ట్రైలర్ కు రేటింగ్ 1 / 5.

Tags

Next Story