"తురుమ్ ఖాన్" నుంచి 'రంగు రంగుల చిలక' రిలీజ్

తెలుగు ఇండస్ట్రీలో తెలంగాణ నేపథ్యంలో వస్తున్న మరో తెలంగాణ పల్లె కథా చిత్రం "తురుమ్ ఖాన్". స్టార్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై ఎండీ. ఆసిఫ్ జానీ నిర్మాతగా, శివకళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ పనులు ముగించుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈ చిత్రం నుంచి తొలి సాంగ్ 'రంగు రంగుల చిలక' పాట విడుదలైంది. ధమాకా ఫేమ్ దర్శకుడు త్రినాథరావు నక్కిన చేతులమీదుగా మొదటి పాట ఘనంగా విడుదలైంది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో దుమ్ముదులుపుతోంది.
దశాబ్ద కాలంగా ఎన్నో సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా, డైలాగ్ రైటర్ గా పనిచేసిన ఎన్ శివ కళ్యాణ్ తురుమ్ ఖాన్ లు సినిమాకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిర్మాత అసిఫ్ జానీ మాట్లాడుతూ.. బలమైన కథ, సహజమైన పాత్రలు ఉన్న ఈ చిత్రాన్ని క్వాలిటీగా రూపొందించామని,అన్ని పనులను ముగించుకొని త్వరలోనే ప్రేక్షకులముందుకు వస్తున్నట్లు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com