Ranveer Singh Deepika Padukone Ipl: రణవీర్, దీపిక కొత్త బిజినెస్.. అందులో పెట్టుబడికి రెడీ..
Ranveer Singh Deepika Padukone Ipl: సాధారణంగా సినీ పరిశ్రమలోని నటీనటులు కేవలం యాక్టింగ్ మాత్రమే కాకుండా బిజినెస్‌పైన కూడా దష్టిపెడుతుంటారు. ఇప్పటికే దాదాపు టాలీవుడ్‌లోని హీరోహీరోయిన్లు మాత్రమే కాకుండా దర్శక నిర్మాతలు కూడా సినిమాలతో పాటు ఇతరేతర వ్యాపారాలను కూడా మ్యానేజ్ చేస్తున్నాడు. బాలీవుడ్ క్యూట్ కపుల్ రణవీర్ సింగ్, దీపికా పదుకొనె కూడా త్వరలోనే ఒక కొత్త బిజినెస్‌లోకి అడుగుపెట్టనున్నారట.
క్రికెట్ అనేది చూసేవారికి ఎమోషన్‌లాగా మారిపోయింది. అయితే బిజినెస్ దృష్టి ఉన్నవారికి మాత్రం ఇది మంచి వ్యాపారం. ఇతర క్రికెట్ ఫార్మ్స్ కంటే ఐపీఎల్ ఒక మంచి బిజినెస్. టీ20, టెస్ట్‌లను ఇష్టపడని వారు కూడా ఐపీఎల్ మ్యాచ్‌లను ఎంతో ఇష్టంగా చూస్తారు. అందుకే ప్రతీ జింతా, షారూఖ్ ఖాన్ లాంటి నటీనటులు ప్రతీ సంవత్సరం ఐపీఎల్ టీమ్స్‌నుు కొంటూ ఈ బిజినెస్‌లో యాక్టివ్ అయ్యారు. వచ్చే ఏడాది నుండి రణవీర్, దీపికా కూడా అదే చేయనున్నారు.
రణవీర్ సింగ్, దీపికా పదుకొనె.. ఇద్దరూ వరుసగా సినిమాలు చేస్తూ.. హిట్లు కొడుతూ ఇండస్ట్రీలో చాలా బిజీగా గడిపేస్తున్నారు. వారికి ఇతర వ్యాపారాలు ఉన్నా కూడా వాటికంటే ఎక్కువగా సినిమాలపైనే దృష్టిపెడుతున్నారు ఇద్దరు. అయితే ఈసారి ఐపీఎల్ బిజినెస్‌లోకి దిగాలని నిర్ణయించుకున్నారట ఈ కపుల్. వచ్చే ఏడాది ఐపీఎల్ వేలంపాటలో వీరు కూడా పాల్గొని ఒక ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నారని బాలీవుడ్ వర్గాల సమాచారం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com