Deepika-Ranveer: విడాకుల రూమర్స్.. స్టేజ్‌పై రణవీర్, దీపిక..

Deepika-Ranveer: విడాకుల రూమర్స్.. స్టేజ్‌పై రణవీర్, దీపిక..
Deepika-Ranveer: ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేయడం ఈ మధ్య సోషల్ మీడియాలో పరిపాటి అయిపోయింది.

Deepika-Ranveer: ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేయడం ఈ మధ్య సోషల్ మీడియాలో పరిపాటి అయిపోయింది. అది సెలబ్రెటీల విషయంలో మరీ ఎక్కువగా ఉంటుంది. శుభమా అంటూ పెళ్లి చేసుకుని చక్కగా కాపురం చేస్తూ ఎవరి ప్రాజెక్టుల్లో వారు బిజీగా ఉన్న జంటను చూసి కన్నుకుట్టిందేమో.. విడిపోతున్నారంటూ రూమర్స్ మొదలెట్టేశారు. అనుకోకుండా జరిగే విషయాల్ని అదే అవకాశంగా మలచుకోవాలని చూస్తారు. ఇటీవల ముంబైలో జరిగిన ఇండియన్ స్పోర్ట్స్ ఆనర్స్ ఈవెంట్‌కు హాజరైన దీపిక, రణవీర్ వేదిక వద్దకు వస్తున్నప్పుడు దీపకకు చేయి అందించినా ఆమె రణవీర్ చేయి పట్టుకోలేదు.. దీంతో ఇదే అదనుగా భావించి ఏంటి ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ తగ్గినట్టుంది.. గొడవ పెట్టుకున్నారేమో అని ఒకరు, విడిపోతున్నారేమో అని మరొకరు సోషల్ మీడియాలో రచ్చ చేయడం మొదలెట్టారు. వీటన్నిటికీ చెక్ పెట్టే దిశగా ఈ క్యూట్ కపుల్స్ ఇద్దరూ వేదిక మీద ఒకరిపై ఒకరు చలోక్తులు వేసుకుంటూ ఆడియన్స్‌ని మురిపించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ కూడా దీపిక మరియు రణవీర్‌ల క్యూట్ ఫెర్మామెన్స్‌కి నవ్వుతూ కనిపించారు. వర్క్ ఫ్రంట్‌లో, దీపిక ప్రస్తుతం హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తోన్న 'ఫైటర్' షూటింగ్‌లో బిజీగా ఉంది. ఇంకా ప్రభాస్, అమితాబ్ బచ్చన్‌లతో కలిసి 'ప్రాజెక్ట్ కె' అనే మరో సినిమాను కూడా చేస్తోంది. అయితే ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతానికి ఆగిపోయింది. అంతేకాకుండా, దీపిక అమితాబ్ బచ్చన్‌తో కలిసి 'ది ఇంటర్న్' అనే రీమేక్ చిత్రంలో నటించనుంది. మరోవైపు రణవీర్, కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ'లో నటించబోతున్నాడు. ఇది ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో అలియా భట్, షబానా అజ్మీ, ధర్మేంద్ర, జయా బచ్చన్ వంటి ప్రముఖ తారలు ఇందులో నటించారు.

Tags

Read MoreRead Less
Next Story