Don 3 First Look: షారుఖ్ స్థానంలో రణవీర్.. ఫస్ట్ లుక్ తో క్లారిటీ ఇచ్చిన మేకర్స్

గత రెండేళ్లలో ట్విట్టర్‌లో అత్యధిక ట్రెండింగ్‌లో ఉన్న సినిమాల్లో 'డాన్ 3' ఒకటి. తాజాగా డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ ఈ వెయిటింగ్ కు తెరదించాడు. 'డాన్ 3'గా రణవీర్ సింగ్ కనిపించనున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు రాగా.. ఇటీవలే మేకర్స్ దీనిపై అధికారిక ప్రకటన చేశారు. ఇప్పుడు ఫస్ట్ లుక్ రివీల్ చేశాడు ఫర్హాన్ అక్తర్. ఒక బల్లపై కూర్చున్న స్టార్ వీపును చూపిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియోను పంచుకున్నాడు. ఈ సమయంలో అతను హూడీలో ఉన్నాడు. ప్రోమోలో డాన్ కో గయారా ముల్కోన్ కి పోలీస్ అనే ఐకానిక్ డైలాగ్ వినిపిస్తోంది. మేకర్స్ మొత్తానికి డాన్‌గా రణవీర్ సింగ్ ముఖాన్ని ఆవిష్కరించారు. ఇందులో రణవీర్ లెదర్ జాకెట్, షేడ్స్‌లో స్మాష్‌గా కనిపిస్తున్నాడు. షారుఖ్ ఖాన్ అభిమానులు మేకర్స్ రిలీజ్ చేసిన ఈ లేటెస్ట్ అప్ డేట్ తో డిసప్పాయింట్ చెందుతుండగా, రణ్‌వీర్ సింగ్ తనను తాను నిరూపించుకునే అవకాశాన్ని అర్హుడని మరికొందరు అతనికి మద్దతుగా నిలుస్తున్నారు.
A New Era Begins #Don3 @RanveerOfficial #JasonWest @javedakhtarjadu @ritesh_sid @ShankarEhsanLoy @PushkarGayatri @j10kassim @roo_cha @vishalrr @excelmovies @rupinsuchak @chouhanmanoj82 pic.twitter.com/i1hHrl6fuo
— Farhan Akhtar (@FarOutAkhtar) August 9, 2023
ఇక ఈ క్రేజీ వీడియోను షేర్ చేసిన ఫక్తర్.. 'ఏ న్యూ ఎరా బిగిన్స్ డాన్ 3' అంటూ క్యాప్షన్ లో రాసుకువచ్చాడు. అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటోన్న రణవీర్ ఫస్ట్ లుక్ వీడియో.. ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది. ఇక ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్ కు.. తాజా వీడియో మంచి బూస్టప్ ను ఇస్తోంది.
ఫ్రాంచైజీ మూడవ విడత కోసం హీరో షారూఖ్ ఖాన్ తిరిగి రాలేడని, అతని స్థానంలో రణవీర్ సింగ్ 'డాన్ 3'లో కనిపిస్తారని అనేక నివేదికలు గతంలో సూచించాయి. కాగా ఆగస్టు 8న ఫర్హాన్ కూడా తన పాపులర్ యాక్షన్ ఫ్రాంచైజీ 'డాన్' మూడవ భాగంలో కొత్త నటుడు నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంతే కాకుండా తాను ఓ మల్టీ టాలెంటెడ్ హీరోతో ఈ సిరీస్‌ను ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. ఇది 2025 లో విడుదల కానున్నట్టు తెలుస్తోంద
ఫర్హాన్ అక్తర్ షారుఖ్ ఖాన్ నటించిన డాన్ మొదటి రెండు భాగాలకు దర్శకత్వం వహించాడు. వీటిలో మొదటిది 2006లో విడుదల కాగా, రెండవ భాగం 2011లో వచ్చింది. 2006లో రిలీజైన డాన్ చిత్రంలో షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా, బోమన్ ఇరానీ, ఇషా కొప్పికర్ ప్రధాన పాత్రల్లో నటించారు. అంతే కాదు ఇది న్యూచాటెల్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ ఆసియా చిత్రంగా కూడా గెలుపొందింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com