దొరల బ్యాక్ డ్రాప్ లో 'రుద్రంగి'.. జులై 7 న రిలీజ్..!
జగపతి బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'రుద్రంగి'. తెలంగాణలోని దొరతనపు బ్యాక్ డ్రాప్ లో సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రతిష్టాత్మకంగా నిర్మించగా... అజయ్ సామ్రాట్ దర్శక్వం వహించారు. ఇప్పటికే ట్రైలర్ విడుదలై మంచి పేరును తెచ్చుకుంది. జులై 7 న సినిమా విడుదలవనుందని చిత్రబృందం ప్రకటించింది. ఇప్పటికే అన్ని పాత్రల ఫస్ట్ లుక్ పోస్టర్స్. పాటలు, టీజర్ తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.
ఒకప్పటి తెలంగాణ సామాజిక పరిస్థితులను నేపథ్యంగా ఎంచుకుని పీరియాడిక్ మూవీగా 'రుద్రంగి' రూపొందింది. నాటి తెలంగాణాలో దొరల ఆగడాలు ఎలా ఉన్నాయి అనేది కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నారు. భారీ నిర్మాణ విలువలు, ఆసక్తికర కథా కథనాలతో సినిమా ఆకట్టుకోబోతోంది. జగపతి బాబు, ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, విమలా రామన్, మమతా మోహన్ దాస్, కాలకేయ ప్రభాకర్, ఆర్ఎస్ నంద తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ - సంతోష్ శనమోని, ఎడిటింగ్ - బొంతల నాగేశ్వర్ రెడ్డి, సంగీతం - నాఫల్ రాజా ఏఐఎస్పి, పీఆర్ వో: జి.ఎస్. కె మీడియా.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com