సౌత్ ను ఊపేస్తానంటోన్న రాశిఖన్నా ..

సౌత్ ను ఊపేస్తానంటోన్న రాశిఖన్నా ..
'ఊహలు గుసగుసలాడే' అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించింది రాశిఖన్నా.

'ఊహలు గుసగుసలాడే' అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించింది రాశిఖన్నా. తొలి సినిమాకే మంచి పర్ఫార్మర్ గా ఆకట్టుకుంది. తర్వాత గ్లామర్ విషయంలోనూ మరీ హద్దులేం పెట్టుకోలేదు. దీంతో తను టాప్ హీరోయిన్ అవుతుందనుకున్నారు. అన్నట్టుగానే ఎన్టీఆర్ తో 'జైలవకుశ' లో నటించింది. కానీ ఎన్టీఆర్ నట విశ్వరూపం ముందు తనే కాదు.. మరో హీరోయిన్ నివేదాను సైతం ఎవరూ పట్టించుకోలేదు. అయితే రాశి కెరీర్ కూడా ఒక హిట్ రెండు ఫ్లాపులు అన్నట్టుగా సాగడంతో కాస్త ఇబ్బందిపడింది.

టాప్ హీరోల మేటర్ వదిలేసి మీడియం రేంజ్ స్టార్స్ తోనే అడ్జెస్ట్ అయింది రాశి. అయినా సడెన్ గా ఆఫర్స్ తగ్గాయి తనకు. అంతకు ముందు వెంకీమామ, ప్రతి రోజు పండగే సినిమాలతో విజయాలు అందుకుంది. ఆ ఊపును కంటిన్యూ చేస్తూ 'వరల్డ్ ఫేమస్ లవర్' లో ఏకంగా ఓ ఇంటిమేట్ సీన్ సైతం చేసింది. ఆ మూవీ ఫ్లాప్ తర్వాత రాశిని పెద్దగా పట్టించుకోలేదెవరూ. దీంతో ఇక తెలుగులో తన పని అయిపోయిందనే అనుకున్నారు అంతా.

ఆ మధ్య హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ఆకట్టుకున్న రాశి అనూహ్యంగా మళ్లీ బౌన్స్ బ్యాక్ అయింది. తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. తమిళ్ లో ఏకంగా ఐదు, మళయాలంలో ఓ సినిమా చేస్తోంది. తెలుగులో గోపీచంద్, మారుతి కాంబోలో వస్తోన్న పక్కా కమర్షియల్ తో పాటు, నాగచైతన్య, విక్రమ్ కుమార్ కాంబోలో వస్తోన్న థ్యాంక్యూలో నటిస్తోంది. అంటే టోటల్ గా రాశిఖన్నాచేతిలో ఇప్పుడు ఎనిమిది సినిమాలున్నాయన్నమాట. వీటిలో మూడు సినిమాలు రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. మరి ఈ మూవీస్ తో అమ్మడు మరో మూడు నాలుగేళ్లు సౌత్ లో సందడి చేయడం ఖాయం. సో.. రాశిఖన్నా పని అయిపోయింది అనేమాటకు ఫుల్‌స్టాప్ పడ్డట్లే అన్నమాట.

Tags

Next Story