Rashi Khanna: హీరోయిన్ అంటే కేవలం వాటి కోసమే కాకూడదు.. రాశి ఖన్నా సెన్సేషనల్ కామెంట్స్

Rashi Khanna (tv5news.in)
Rashi Khanna: బొద్దుగుమ్మ రాశి ఖన్నా చాలాకాలంగా తెలుగు ప్రేక్షకులను తన నటనతో, గ్లామర్‌తో ఇంప్రెస్ చేస్తూనే ఉంది. ముందుగా అక్కినేని కుటుంబం నటించిన 'మనం' చిత్రంలో చిన్న రోల్ చేసిన రాశి.. 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో హీరోయిన్‌గా మారింది. యాక్టర్‌గానే కాదు, సింగర్‌గా కూడా పలు చిత్రాల్లో మెప్పించింది రాశి. తాజాగా ఈ నటి సినిమాల్లో హీరోయిన్ల పాత్రలపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
మామూలుగా కమర్షియల్ సినిమాలంటే అందులో హీరోయిన్‌కు చాలా తక్కువ ప్రాధాన్యత ఉంటుంది. తనకు యాక్టింగ్ చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉండదు. రొమాంటిక్ సీన్స్, సాంగ్స్ వరకే తన పాత్ర పరిమితమయిపోతుంది. అయితే ఇలాంటి పాత్రలు చేయడం ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలామంది యంగ్ బ్యూటీలకు నచ్చట్లేదు. అందుకే ఒకరు తర్వాత ఒకరు వీటిపై రియాక్ట్ అవుతున్నారు.
ఇటీవల కృతి సనన్.. స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్లకు చాలా తక్కువగా ప్రాధాన్యత ఉంటుందని.. ఒకవేళ ఎక్కువగా ప్రాధాన్యత ఉంటే ఆ సినిమాల్లో స్టార్ హీరోలు నటించడానికి ఇష్టపడరని ఘాటుగా సమాధానం చెప్పింది. తాజాగా రాశి ఖన్నా కూడా హీరోయిన్ అంటే రొమాంటిక్ సీన్స్, సాంగ్స్ వరకే పరిమితం కాకూడదని తేల్చి చెప్పింది.
సినిమాల్లో ఉండే పాద పద్ధతులు బ్రేక్ చేయాలి అనుకుంటున్నాను అంటూ రాశి ఖన్నా చెప్పుకొచ్చింది. తాను ఎలాంటి పాత్ర చేయడానికి అయినా సిద్ధమే కానీ అది ప్రేక్షకులపై ప్రభావం చూపేలా ఉండాలని తెలిపింది. ప్రస్తుతం తనకు హిందీ నుండి ఎక్కువగా ఆఫర్లు వస్తున్నాయని తెలిపింది రాశి. రాశి ప్రస్తుతం షాహిద్ కపూర్‌తో ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com