Rashmi Gautam : చిరంజీవి సినిమా అయిన సరే.. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే.. లే..!

Rashmi Gautam : బుల్లితెర టాప్ యాంకర్ లలో రష్మీ గౌతమ్ ఒకరు.. సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తూ ప్రేక్షకులకి పరిచయమైన రష్మీ .. జబర్దస్త్ షోతో ఒక్కసారిగా పాపులర్ అయింది. జబర్దస్త్‌తో పాటుగా ఢీ లాంటి షోలు కూడా చేస్తోంది. మధ్యమధ్యలో వెండితెరపై అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఆమెకి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే ఆఫర్ కొట్టేసినట్లుగా ఫిలింనగర్లో న్యూస్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.
మెగాస్టార్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళా శంకర్' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో రష్మీ చిరుతో కలిసి స్టెప్స్ వేయనుందట.. అయితే ఇదే పెద్ద హాట్ టాపిక్ అనుకుంటే ఐటెం సాంగ్ చేయడానికి రష్మీ తీసుకునే పారితోషికం కూడా మరో హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి పక్కన ఛాన్స్ కొట్టేసిన రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే .. లే అంటుందట రష్మీ.
ఈ ఒక్క పాట కోసం ఆమె దాదాపు 40 లక్షల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. అందుకు నిర్మాతలు కూడా ఒకే చెప్పారట.. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయనున్నారట. ఇక్కడో ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే... ఈ పాట కోసం రష్మీని రిఫర్ చేసింది శేఖర్ మాస్టార్ అని తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా, కీర్తి సురేష్ ఓ కీలకపాత్రలో నటిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com