Rashmika Mandanna : సైబర్ భద్రతకు అంబాసిడర్ గా రష్మిక

Rashmika Mandanna : సైబర్ భద్రతకు అంబాసిడర్ గా రష్మిక
X

సైబర్ భద్రత అంబాసిడర్ గా నటి రష్మిక మందన్న నియమితులయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదిక ఎక్స్ నుంచి తన అభిమానులతో పంచుకుంది. సైబర్ భద్రతను ప్రోత్సహించేందుకు గాను కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఇండియన్ సైబర్ క్రైం కో-ఆర్డినేషన్ సెంటర్ (14సీ) తనను జాతీయ అంబాసిడర్ గా నియమించినట్లు ఆమె తన అభిమానులకు. తెలిపింది. గతంలో కొందరు తన ఫొటోలను ఉపయోగించి డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా అసభ్యకర వీడియోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీనిపై ఆమె సైబర్ క్రైం సెంటర్లో ఫిర్యాదు చేసింది.

దాంతో ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు సైబర్ క్రైం సెంటరుకు వీలు చిక్కింది. తన ఫిర్యాదుపై కేంద్ర ప్రభుత్వం ఎంతగానో సహకరించిందని, దీంతో అప్పటినుంచి సైబర్ నేరాల గురించి అవగాహన కలిగించాలని నిర్ణయం తీసుకున్నట్లు రష్మిక మందన్న వెల్లడించింది. 14సీకి తనను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినందుకు చాలా సంతోషంగా ఉన్నదని, మన కోసం, భవిష్యత్ తరాలకు సురక్షితమైన సైబర్ స్పేస్న ఇచ్చేందుకు ఏకమవుదామని రష్మిక పిలుపునిచ్చింది. సైబర్ క్రైం గురించి ఏదైనా సహాయం పొందాలంటే 1930 నంబర్కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in ను సందర్శించాలని ఆమె తెలిపింది.

Tags

Next Story