Rashmika Mandanna: స్నేహితురాలి పెళ్లిలో రష్మిక.. నటి కాకముందు నా లైఫ్ ఇలా అంటూ..

Rashmika Mandanna: స్నేహితురాలి పెళ్లిలో రష్మిక.. నటి కాకముందు నా లైఫ్ ఇలా అంటూ..
Rashmika Mandanna: ‘‘నటిగా ఈ ప్రపంచానికి పరిచయం కాకముందు నా లైఫ్‌ ఇలా ఉండేది’’ అని అంటూ తన స్నేహితురాలి పెళ్లిలో దిగిన ఫోటోలను షేర్ చేసింది.

ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన నటీమణుల్లో రష్మిక మందన్న ఒకరు. ఆమె అందానికి ముగ్ధులైన అభిమానులు ఆమెను 'నేషనల్ క్రష్' అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఆమె తన అభిమానుల కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటుంది. ఆమె తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకుంటుంది. తాజాగా తన స్నేహితురాలి పెళ్లిలో చేసిన సందడి, వివాహానికి సంబంధించిన అందమైన చిత్రాలను పంచుకున్నారు.


వేడుకలో, ఆమె సంప్రదాయ దుస్తులను ధరించి ఎంతో ముచ్చటగా ఉంది. ఫోటోలను పోస్ట్ చేస్తూ.. ఆమె ఇలా రాసింది.. "ఈ రోజు నా స్నేహితురాలు @raaginimuddaiah వివాహం చేసుకున్నారు.. నేను తన పెళ్లికి హాజరవగలనో లేదో అని టెన్షన్ పడ్డాను. నేను ఎక్కాల్సిన ఫ్లైట్ మిస్ అయ్యింది. 4 AM ఫ్లైట్ మిస్ అయింది. దాని తర్వాత కూడా 4-5 సార్లు విమానం ఆలస్యమైనందున సమయానికి పెళ్లికి హాజరుకాలేనేమో అనుకున్నాను.


కానీ దేవుని దయ వల్ల నేను ఎట్టకేలకు ఆమె పెళ్లికి వచ్చాను. నేను ఈ అమ్మాయిలతో కలిసి పెరిగాను.. 17 సంవత్సరాలనుంచి మా పరిచయం అలానే ఉంది. ఏమీ మారలేదు.. వారు నన్ను తెలివిగా బుట్టలో పడేస్తారు.. ఎక్కువ సేపు వారితో గడిపేలా ఉంచుతారు.. ఈ రోజు నేను వీళ్లందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. నేను మీ అందరితో నా వ్యక్తిగత విషయం ఒకటి పంచుకోవాలనుకుంటున్నాను.. అదేమిటంటే రష్మిక నటికాక ముందు ఇలా ఉండేది.. ఇప్పుడూ అలానే ఉంది.. ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు అని రష్మిక రాసుకొచ్చింది.


కాగా, రష్మిక.. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి స్పై-థ్రిల్లర్ మిషన్ మజ్నులో కనిపించనుంది. అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. రణబీర్ కపూర్‌తో మరో చిత్రం షూటింగ్ జరుగుతోంది.


ఇక తెలుగులో అల్లు అర్జున్‌తో బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప సీక్వెల్ చిత్రం పుష్స ది రూల్ లో నటించనుంది. ఇది అతి త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన తలపతి 66లో దళపతి విజయ్ సరసన కథానాయికగా నటి ఎంపికైంది. దుల్కర్ సల్మాన్ తదుపరి హను రాఘవపూడితో కలిసి సీతా రామం చిత్రంలో కూడా ఆమె అతిధి పాత్రలో నటిస్తోంది.

దీనితో పాటు, అల్లు అర్జున్‌తో కరణ్ జోహార్ యొక్క కాఫీ విత్ కరణ్ 7 లో రష్మిక కనిపించనుందని టాక్. టీమ్ ఇప్పటికే చాట్ షో కోసం అల్లు అర్జున్, రష్మిక మందన్నలను సంప్రదించినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story