Rashmika : సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా రష్మిక

Rashmika : సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా రష్మిక
X

స్టార్ బ్యూటీ రష్మిక ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖకు చెందిన సైబర్‌ దోస్త్ విభాగం అధికారికంగా ప్రకటించింది. ఇక ఇదే విషయంపై రష్మిక కూడా ఓ వీడియోను విడుదల చేశారు. అందులో గతంలో తాను ఎదుర్కొన్న డీప్‌ ఫేక్‌ వీడియో గురించి చెప్పుకొచ్చారు. ‘‘కొన్ని నెలల క్రితం నా డీప్‌ ఫేక్‌ వీడియో వైరల్‌ అయ్యింది. అది నన్ను చాలా బాధపెట్టింది. ఆ సమయంలోనే సైబర్‌ క్రైమ్‌కు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నా. దాని గురించి అందరికీ తెలియజేయాలని అనుకున్నాను. ఇప్పుడు అదే విషయాన్ని పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌కు (I4C) నేను బ్రాండ్‌ అంబాసిడర్‌ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధ్వర్యంలో ఇది పనిచేస్తుంది. ఈ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఇలాంటి నేరాలపై నేను అవగాహన కల్పిస్తూనే ఉంటాను. మన దేశాన్ని సైబర్‌ నేరాల నుంచి కాపాడతాను’’ అంటూ చెప్పుకొచ్చింది రష్మిక అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tags

Next Story