Liger Movie: 'లైగర్'లో ఐటెమ్ సాంగ్.. విజయ్‌తో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
Liger Movie: బాలీవుడ్ భామలను దింపి మరీ ఐటెమ్ సాంగ్స్‌కు స్టెప్పులేయిస్తాడు పూరీ.

Liger Movie: రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన కెరీర్‌లో చేస్తు్న్న తొలి పాన్ ఇండియా చిత్రం 'లైగర్'. డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దీనికి దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే లైగర్ నుండి విడుదలయిన గ్లింప్స్ అందరినీ ఆకట్టకుంది. ఇందులో విజయ్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఓ క్రేజీ హీరోయిన్‌ను లైన్‌లో పెట్టిందట మూవీ టీమ్.
పూరీ జగన్నాధ్ కమర్షియల్ సినిమలు తెరకెక్కించడంలో ఎక్స్‌పర్ట్. అయితే కమర్షియల్ సినిమాలో ఐటెమ్ సాంగ్ తప్పనిసరిగా ఆశిస్తారు ప్రేక్షకులు. అందుకే దాదాపు పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేసిన అన్ని సినిమాల్లో ఐటెమ్ సాంగ్ ఉంటుంది. బాలీవుడ్ భామలను దింపి మరీ ఈ ఐటెమ్ సాంగ్స్‌కు స్టెప్పులేయిస్తాడు పూరీ. అయితే లైగర్ కోసం పూరీ రూటు మార్చినట్టు అనిపిస్తోంది.
పాన్ ఇండియా చిత్రాలతో బిజీ అయిన రష్మికతో లైగర్‌లో ఐటెమ్ సాంగ్ ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే విజయ్, రష్మిక జంటకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఒకవేళ రష్మిక ఈ సినిమాలో డ్యాన్స్ చేస్తే వీరి కెమిస్ట్రీతో మూవీకి హైప్ వస్తుందనే ప్లాన్‌లో ఉందట లైగర్ టీమ్. కానీ రష్మిక ఇప్పటివరకు ఏ సినిమాలోనూ స్పెషల్ సాంగ్ చేయలేదు. లైగర్‌లో చేస్తుందో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.
RELATED STORIES
Liger Movie: త్వరలోనే 'లైగర్' ప్రమోషన్స్ షురూ.. ట్రైలర్ ఎప్పుడంటే..?
28 Jun 2022 2:45 PM GMTNithya Menen: వీల్ చైర్లో నిత్యా మీనన్.. ఇంతకీ ఏం జరిగింది..?
28 Jun 2022 2:11 PM GMTManasanamaha: ఒక్క తెలుగు షార్ట్ ఫిల్మ్.. గిన్నీస్ రికార్డ్‌తో పాటు...
28 Jun 2022 1:30 PM GMTAvika Gor: బాయ్‌ఫ్రెండ్ గురించి గొప్పగా మాట్లాడిన నటి.. తన వల్లే అంతా...
28 Jun 2022 11:30 AM GMTNaga chaitanya: తన ఫస్ట్ లవ్‌పై నోరువిప్పిన చైతూ.. కాలేజీ రోజుల్లోనే..
28 Jun 2022 10:30 AM GMTMohan Babu: తిరుపతిలో కోర్టు విచారణకు హాజరుకానున్న మోహన్‌బాబు.. తనతో...
27 Jun 2022 3:15 PM GMT