Rashmika Mandana: సమంతను చూసి షాకయ్యా.. తగ్గేదేలే అంటూ..

Rashmika Mandana: వావ్ సమంత వాటే బ్యూటిఫుల్ ఫెర్మామెన్స్.. పాటకు సూటయ్యే విధంగా నీ అభినయం.. ఐటెం సాంగ్‌లో సమంత నటిస్తుందంటే అందులో ఏదో విషయం ఉండే ఉంటుంది అని ఆడియన్స్ అనుకునే విధంగా నర్తించావు.. చాలా సూపర్‌గా ఉంది నీ డ్యాన్స్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతోంది పుష్ప చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తు్న్న రష్మిక.
సినిమాలో గెస్ట్ రోల్ అంటే దానికో ప్రత్యేకత తప్పనిసరిగా ఉంటుంది.. ఇప్పటికే మహానటి చిత్రం ద్వారా సమంత నిరూపించుకుంది.. తాజాగా పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ అంతటా మార్మోగిపోతోంది.. ఇప్పటికే మిలియన్ల వ్యూస్‌ని సొంతం చేసుకుంది.. ఐటెం సాంగ్స్‌లో ఓ ట్రెండ్‌ని క్రియేట్ చేస్తుందనడంలో సందేహం లేదు అని సమంత, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం సినీ ప్రేమికుల కళ్లు పుష్ప చిత్రం పైనే ఉన్నాయి. డిసెంబర్ 17 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సుకుమార్ సినిమాను భారీగా తెరకెక్కించారు. రష్మిక తొలిసారిగా డీగ్లామర్ పాత్రలో నటిస్తుండడం, సినిమాలోని పాత్రలన్నీ అత్యంత సహజంగా ఉండడంతో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది.
ఇదిలా ఉంటే సినిమాలో సమంత చేసిన స్పెషల్ సాంగ్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. చాలా రోజుల సమంత గ్లామర్‌గా కనిపించడంతో అందరి దృష్టి ఒక్కసారిగా పాటపై పడింది. ఓవైపు హీరోయిన్‌గా చేస్తూనే ఓ స్పెషల్ సాంగ్ చేయడంతో అది హాట్ టాపిక్‌గా మారింది.
రిలీజ్ డేట్ దగ్గరపడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే రష్మిక వరుస ఇంటర్వ్యూలు చేస్తూ సందడి చేస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రష్మిక.. సమంత గురించి ఆసక్తకరమైన వ్యాఖ్యలు చేసింది. 'సమంత ఓ వైపు సూపర్ స్టార్‌గా రాణిస్తూనే మరోవైపు స్పెషల్ సాంగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. పాట సూపర్‌గా వచ్చింది.. సమంత డ్యాన్స్ పాటకు మరింత అందాన్ని తెచ్చింది అని సమంతను ఆకాశానికి ఎత్తేస్తుంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com