Rashmika Mandanna : ఇండస్ట్రీ వదిలి వెళ్లాలనుకున్నా
నార్త్, సౌత్ అనే తేడా లేకుండా సినిమాల్లో బిజీగా ఉంది, హీరోయిన్ రష్మిక మందన. తాజాగా ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ... తనపై జరుగుతోన్న ట్రోలింగ్ పై స్పందించింది. తనపై వస్తోన్న విమర్శలు మానసికంగా తనను ప్రభావితం చేశాయని వెల్లడించింది. సినీ పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నారా అన్న ప్రశ్నపై అవుననే స్పందించింది రష్మిక.
'కాంతారా' చూడలేదన్నందుకు విపరీతమైన ట్రోలింగ్ కు గురైంది రష్మిక. రిషబ్ షెట్టి, రాకేష్ విషయంలోనూ ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. తాజాగా మిషన్ మజ్నూ వల్ల కూడా ట్రోలింగ్ కు గురైంది. అయితే ఇలా జరిగిన ప్రతీసారి చాలా బాధపడినట్లు తెలిపింది.
వర్కౌట్ చేస్తే మగాడిలా కనిపిస్తున్నానని, చేయకపోతే లావుగా ఉన్నానంటూ ట్రోలింగ్ చేస్తున్నారని చెప్పింది. ఎక్కువ మాట్లాడితే ఒకలా, తక్కువ మాట్లాడితే మరొకలా ట్రోలింగ్ చేస్తున్నారని వాపోయింది ఈ కన్నడ సొగసరి. ఇన్ని ఇబ్బందుల మధ్య తాను ఇండస్ట్రీలో ఉండాలా వద్దా అని, చాలా సార్లు అనుకున్నట్లు తెలిపింది. తాను ఎలా ఉండాలో, ఎలా కనిపించాలో, ఎలా మాట్లాడాలో క్లారిటీ ఇవ్వాలంటూ ట్రోల్ చేసే వారిని కోరింది. "నాతో మీకు ఏ సమస్య ఉందో చెప్తే దానిని సరిచేసుకుంటానని" విన్నవించుకుంది.
పుష్ప 2 లో రష్మిక బిజీ...
రష్మిక తాజాగా నటించిన 'మిషన్ మజ్నూ' రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకుంది. పుష్ప 2 షూటింగ్ విశాఖపట్నంలో జరుగుతోంది. త్వరలోనే రష్మిక టీమ్ లో జాయిన్ అవనుంది. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా యానిమల్ సినిమా చేయనుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com