Rashmika Mandanna : ఆ క్యారెక్టర్‌లో నటించాలనుంది : రష్మిక మందన

Rashmika Mandanna : రష్మిక మందన ఇటీవళ విడుదలైన సీతారామం సినిమాలో అఫ్రీన్ అనే కీలక పాత్ర పోషించింది. తన కెరీర్‌లో వచ్చిన మంచి గుర్తిండిపోయే అవకాశాల్లో ఇదొకటి అని రష్మిక తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. ప్రస్తుతం టాప్ హీరోయిన్‌లలో ఒకరుగా, నేషనల్ క్రష్‌గా రష్మిక సినీఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది.
సీతారామం చిత్రం కోసం చిత్ర యూనిట్ మొత్తం రెండేళ్లు కష్టపడింది. దానికి తగిన ఫలితమే ఇప్పుడు కనిపిస్తోంది అందుకే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అని రష్మిక చెప్పింది. నాకు సీతారామం లాంటి సినిమాలు అదృష్టం వల్ల వచ్చినా దానికితోడు కష్టం కూడా ఉందని తెలిపింది.
ఛలో సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడే గీతాగోవిందం ఆఫర్ వచ్చిందని చెప్పింది. హను రాఘవపూడి నన్ను సీతారమంలో చాలా కొత్తగా చూపించారు. ఆ పాత్రను నేనెప్పుడూ మర్చిపోలేను. హను రాఘవపూడికి మరిన్ని విజయాలు అందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాన్నది రష్మిక. 'బయోపిక్స్, స్పోర్ట్స్ సినిమాల్లో నటించాలని ఎప్పటినుంచో ఉంది. అలాంటి అవకాశం వస్తే అస్సలు వదులుకోను' అని తన మనసులోని భావాలను బయటపెట్టింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com