Rashmika Mandanna: ఆమెకు అమ్మగా మారి రక్షణగా ఉండాలనుంది: రష్మిక

Rashmika Mandanna: రష్మిక మందన్న సమంతపై తన ప్రేమను చాలా సందర్భాలలో వ్యక్తం చేసింది. ఆమె నటించిన చిత్రం వారిసు చిత్రం సంక్రాంతికి విడుదలవబోతున్న సందర్భంలో ఓ ఇంటర్వ్యూలో పాలు పంచుకుంది రష్మిక. ఇంటర్వ్యూలో భాగంగా రష్మిక సమంత యొక్క మైయోసైటిస్ గురించి కూడా మాట్లాడింది.
సమంత అద్భుతమైన మహిళ. ఆమె హృదయం మనోహరం. ఆమె విషయానికి వస్తే నేను ఆమెకు అమ్మగా మారి రక్షణగా ఉండాలనుకుంటున్నాను అని సమంత పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకుంది రష్మిక.
సామ్ తన పరిస్థితి గురించి బయటి ప్రపంచానికి చెప్పినప్పుడే తనకూ తెలిసిందని చెప్పింది. ఆమెకు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించింది. ఆమె శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉండడానికి ఒకరకంగా యుద్ధమే చేస్తోంది. తనలాంటి ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ సమయంలో ఆమె పట్ల మనమందరం అత్యంత శ్రద్ధ, దయ, ప్రేమను కలిగి ఉండాలి.
ప్రపంచం ఆమె పట్ల ప్రేమను మాత్రమే కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను." అని సమంత పట్ల తనకున్న ప్రేమను వ్యక్తపరిచింది. రష్మిక మందన్న సినిమాల విషయానికి వస్తే.. ఆమె నటించిన తాజా చిత్రం వారిసు జనవరి 12న విడుదల కానుంది. ఆమె తదుపరి చిత్రం బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా యొక్క మిషన్ మజ్ను, రణబీర్ కపూర్‌తో యానిమల్, అల్లు అర్జున్ యొక్క పుష్ప: ది రూల్‌లో కనిపిస్తుంది.
సమంత చివరిసారిగా యశోదలో కనిపించింది. ఇది హిట్ టాక్ అందుకుంది. ఆమె నటించిన మరో చిత్రం శాకుంతలం ఫిబ్రవరిలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇక విజయ్ దేవరకొండతో నటిస్తున్న ఖుషి చిత్రం కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com