Rashmika Mandanna: కాబోయే భర్త.. పెళ్లిపై రష్మిక క్లారిటీ

Rashmika Mandanna: వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మికకు పెళ్లి గురించి ఆలోచించే తీరిక లేదంటోంది. ఇంతకు ముందు కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం కూడా చేసుకున్న రష్మిక అతడితో వివాహాన్ని వద్దనుకుని క్యాన్సిల్ చేసుకుంది. మరోపక్క విజయ దేవరకొండతో చనువుగా ఉండడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.. వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు ఆ మధ్య రూమర్లు కూడా వినిపించాయి. అయితే రష్మిక మాత్రం తను నా బెస్ట్ ఫ్రెండ్ అని తమపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టింది.
ఓ ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడుతూ రష్మిక తన మనసులోని భావాలను వ్యక్తపరిచింది. ఎవరినైనా ప్రేమించినప్పుడు వారి పట్ల గౌరవం ఉండాలి. వారి కోసం తగినంత సమయం కేటాయించగలగాలి.. ప్రేమను వర్ణించడం కష్టం. ఎందుకంటే ఇది భావాలకు సంబంధించినది..
ఇక వివాహం గురించి చెబుతూ.. ఇంకా దాని గురించి ఏమీ ఆలోచించలేదు.. నేను ఇంకా చిన్నదాన్ని. అయితే నన్ను అర్థం చేసుకునే వ్యక్తి అయి ఉండాలి. అతడి సాంగత్యం సౌకర్యవంతంగా అనిపించాలి.. అప్పుడే ఆ వివాహబంధం నిలుస్తుంది అని తెలిపింది.
తెలుగులో సక్సెస్ చూస్తున్న ఈ కన్నడ బ్యూటీ బాలీవుడ్‌లో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది. మిషన్ మజ్నులో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన నటిస్తుంది. గుడ్‌బైలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో పాటు వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించిన మరో బాలీవుడ్ సినిమాలో కూడా రష్మికకు అవకాశం వచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com