సినిమా

రష్మికది ఓవర్ యాక్టింగ్ అన్న నెటిజన్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన పుష్ప బ్యూటీ..!

Rashmika Mandanna : ఈ మధ్య సోషల్ మీడియాలో హీరోయిన్స్‌‌ని ట్రోల్‌ చేయడం మనము చూస్తూనే ఉంటాం.. కొందరు హీరోయిన్లు వీటిని పట్టించుకోకుండా లైట్ తీసుకుంటారు..

రష్మికది ఓవర్ యాక్టింగ్ అన్న నెటిజన్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన పుష్ప బ్యూటీ..!
X

Rashmika Mandanna : ఈ మధ్య సోషల్ మీడియాలో హీరోయిన్స్‌‌ని ట్రోల్‌ చేయడం మనము చూస్తూనే ఉంటాం.. కొందరు హీరోయిన్లు వీటిని పట్టించుకోకుండా లైట్ తీసుకుంటారు.. హద్దు మీరితే మాత్రం స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తుంటారు. తాజాగా రష్మిక మందన్నకి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. రష్మిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'సామీ సామీ సాంగ్‌ కోసం ఎంతో కష్టపడ్డాను...అది చూశాక అందరూ నన్ను ప్రశంసిస్తే చాలు. డైరెక్టర్స్‌ ఏం చెబితే అదే నేను చేస్తా' అంటూ మాట్లాడిన వీడియోను తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

అయితే దీనిపైన ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. రష్మికని పుష్ప సినిమాలో హీరోయిన్ తీసుకోకుండా ఉండాల్సింది.. ఓవర్ యాక్టింగ్ చేస్తుందంటూ కామెంట్ చేశాడు. అయితే దీనిపైన రష్మిక స్పందించింది. యాక్టింగో, ఓవర్ యాక్టింగో.. నేను జీవితంలో ఏదోటి సాధించాను.. నువ్వేం సాధించావ్ నానా అంటూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.


కాగా రష్మిక హీరోయిన్ గా నటించిన పుష్ప చిత్రం డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించగా సుకుమార్ దర్శకత్వం వహించారు. సినిమా పైన భారీ అంచనాలున్నాయి.

Next Story

RELATED STORIES