మేనేజర్ తో గొడవలు.. క్లారిటీ ఇచ్చిన రష్మిక

మేనేజర్ తో గొడవలు.. క్లారిటీ ఇచ్చిన రష్మిక
రూ.80లక్షలు మోసం చేశాడనే వార్తలు గుప్పుమన్నాయి


రష్మిక మందన్న తన మేనేజర్ తో గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. మేనేజన్ రూ.80లక్షలు మోసం చేశాడనే వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయంపై రష్మిక మందన్న క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలలో నిజం లేదని తెలిపింది. కాగా విజయ్ దేవరకొండ కుటుంబంతో కలిసి రష్మిక డిన్నర్ చేస్తున్నట్లు ఓ వీడియో వైరల్ అయింది. ఇందుకు మేనేజర్ కారణమని ఇండస్ట్రీవర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఇవన్నీ గాసిస్సేనని రష్మిక టీం కొట్టిపడేసింది.

రష్మిక తన మేనేజర్ తో సామరస్యపూర్వకంగా విడిపోయినట్లు తెలిపారు. ఇద్దరి మధ్య ఎలాంటి వివాదాలు లేవని చెప్పారు. అయితే మేనేజర్ ను సడన్ గా మార్చడంతో పుకార్లు చక్కర్లు కొట్టినట్లు తెలుస్తోంది. కన్నడ మీడియాలో ఈ గాసిప్స్ హల్ చల్ చేస్తున్నాయి. రష్మిక ఇచ్చిన క్లారిటీ పుకార్లకు పులిస్టాప్ పెట్టేవిధంగా ఉన్నాయి.


పాన్ ఇండియా నటి కావాలనే లక్ష్యంతో రష్మిక మందన్న తీవ్రంగా శ్రమిస్తోంది. వారిసు, పొంగల్ హిట్ కాగానే.. మిషన్ మజ్నూ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. సెప్టెంబర్ లో ఆమె రణ్ బీర్ కపూర్ తో కలిసి నటించిన 'ఆనిమల్' సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఈ చిత్రాన్ని అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ దర్శక నిర్మాత సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు. పుష్ప 2 కూడా రిలీజ్ కు దగ్గరపడుతోంది. ఈ సినిమాలో అల్లూ అర్జున్, ఫహద్ ఫాసిల్ తో కలిసి నటిస్తున్నారు.

Tags

Next Story