Rashmika Mandanna: విజయ్ రికమెండేషన్‌తో రష్మికకు బంపర్ ఆఫర్..!

Rashmika Mandanna: రష్మిక మందనా.. ప్రస్తుతం సౌత్‌లో వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న హీరోయిన్స్‌లో ఒకరు. సౌత్‌లోనే కాదు నార్త్‌లో కూడా అమ్మడి హవా బాగానే కొనసాగుతోంది. ఇంకా బీ టౌన్‌లో అడుగుపెట్టకముందే బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమా ఛాన్సులు కొట్టేసిన రష్మిక.. తన ఫ్రెండ్ విజయ్ దేవరకొండ రికమెండేషన్‌తో మరో బంపరాఫర్ కొట్టేసినట్టుగా టాక్ వినిపిస్తోంది.
విజయ్ దేవరకొండ.. ఈ యంగ్ హీరో చేసింది తక్కువ సినిమాలే.. కానీ టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా తాను విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పటికే చాలామంది బాలీవుడ్ బ్యూటీలు విజయ్‌తో సినిమా చేయడానికి ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ స్టార్ దర్శక నిర్మాత కరణ్ జోహార్.. విజయ్‌తో ఎలాగైన నేరుగా హిందీ సినిమా చేయించాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు.
ప్రస్తుతం రష్మిక.. హిందీలో సిద్ధార్థ్ మల్హోత్ర సరసన 'మిషన్ మజ్ను' సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు అమితాబ్ బచ్చన్‌తో 'గుడ్‌బై' అనే చిత్రం చేస్తోంది. ఇవి మాత్రమే కాకుండా కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ చిత్రంలో రష్మికకు హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా ఈ ఛాన్స్ వెనుక విజయ్ హస్తమున్నట్టు కూడా సమాచారం. ఇది నిజమో కాదో తెలియాలంటే ఎవరో ఒకరు అధికారిక ప్రకటన ఇచ్చేవరకు ఎదురుచూడాల్సిందే..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com