Rashmika Mandanna: ఏంటా డ్రస్.. ఎందుకంత రిస్క్: రష్మికపై ట్రోల్స్

Rashmika Mandana: ఫ్యాషన్ మరీ వింత పోకడలు పోతోంది. ఒకరి డ్రెస్ ని మించి మరొకరి డ్రెస్.. సెలబ్రెటీల డ్రెస్ లు ఒక్కోసారి నెటిజన్ల చేతిలో దారుణమైన ట్రోల్స్ కి గురవుతుంటాయి. నేషనల్ క్రష్ బ్యూటీ రష్మిక మందనను ఒక ఆట ఆడుకుంటున్నారు నెటిజన్స్.
బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ మే 25న తన 50వ పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు.. సెలబ్రిటీలను విందుకు ఆహ్వానించి మంచి పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి బాలీవుడ్ స్టార్స్ తో పాటు, టాలీవుడ్ నుంచి కూడా కొందరు నటీనటులు హాజరయ్యారు..
దీంతో పార్టీలో సందడి వాతావరణం నెలకొంది.. రకుల్ ప్రీత్, రష్మిక మందన, చార్మీ కౌర్, పూజా హెగ్డే, విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్, తమన్నా పార్టీలో మెరిశారు. పార్టీ థీమ్ 'బ్లాక్ అండ్ బ్లింగ్' కావడంతో రష్మిక మందన వేసుకున్న డ్రెస్ ట్రోల్స్ కి గురైంది.
ఆ డ్రెస్ తో తాను ఇబ్బంది పడినట్లు కనిపించింది.. అది కాస్తా కెమెరా కంట్లో పడి వైరల్ గా మారింది. ఈ వీడియోలో నటి తన దుస్తులను సరిచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నందున ఆమె దుస్తులలో అసౌకర్యంగా ఉందన్న విషయం స్పష్టమవుతోంది. సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ రష్మిక వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. పోస్ట్ చేసిన కొద్దిసేపటికే, వీడియో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com