Rashmika Mandanna: 'అర్జున్ రెడ్డి' దర్శకుడితో రష్మిక.. హీరోయిన్‌గా కాదు..!

Rashmika Mandanna: ఒక హీరోయిన్ బాలీవుడ్‌లో అవకాశాలు దక్కించుకోవాలంటే ముందు తాను సౌత్‌లో హవా కొనసాగిస్తూ ఉండాలి. ఇక్కడ ఎంతోకొంత పాపులారిటీ వచ్చిన తర్వాత చాలావరకు భామలు బాలీవుడ్‌లో అడుగుపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలా సౌత్ నుండి నార్త్‌కు వెళ్లిన వారిలో రష్మిక మందనా ఒకరు. తాజాగా బాలీవుడ్‌లో రష్మిక మందనాకు ఓ క్రేజీ ఆఫర్ వచ్చిందని టాక్.
రష్మిక నటించిన ఒకేఒక్క పాన్ ఇండియా చిత్రం 'పుష్ప'. కానీ ఈ పుష్ప విడుదల కాకముందే.. రష్మికకు శ్రీవల్లిగా పాపులారిటీ రాకముందే తాను బాలీవుడ్ నుండి అవకాశాలు అందుకుంది. అది కూడా రెండు పెద్ద ప్రాజెక్ట్స్‌తో బాలీవుడ్‌లో రష్మిక డెబ్యూ గ్రాండ్‌గానే ప్లాన్ చేసుకుంది. అయితే చూస్తుండగానే.. రష్మికకు హిందీలో మరిన్ని ఆఫర్లు వస్తున్నట్టుగా సమాచారం. అది కూడా టాలీవుడ్ నుండి బాలీవుడ్ వెళ్లిన ఓ దర్శకుడితో వర్క్ చేయనుందట.
తెలుగులో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన సినిమా ఏది అంటే చాలామందికి వెంటనే గుర్తొచ్చే సమాధానం 'అర్జున్ రెడ్డి'. అలాంటి అర్జున్ రెడ్డిని తెరకెక్కించి సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. ఇప్పటివరకు తెలుగులో మరో సినిమాను తెరకెక్కించలేదు. కాకపోతే అర్జున్ రెడ్డి చిత్రాన్నే హిందీలో 'కబీర్ సింగ్'గా తెరకెక్కించి అక్కడ కూడా సూపర్ హిట్‌ను అందుకున్నాడు.
ఈమధ్య హీరోలు, దర్శకులు కూడా ఒకే భాషా పరిశ్రమలో ఫిక్స్ అయిపోకుండా అన్ని ఇండస్ట్రీలకు చుట్టేస్తున్నారు. అలాంటి దారిలోనే వెళ్తున్నాడు సందీప్ రెడ్డి వంగా కూడా. హిందీలో కబీర్ సింగ్ సూపర్ హిట్ కావడంతో.. అక్కడే రణభీర్ కపూర్‌తో 'యానిమల్' అనే చిత్రాన్ని స్టార్ట్ చేశాడు సందీప్. అయితే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే అవకాశం రష్మికకు లభించిందని టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే ఇద్దరు బాలీవుడ్ యంగ్ హీరోలతో సినిమా చేసే అవకాశం దక్కించుకున్న రష్మిక.. ఇప్పుడు మరో యంగ్ హీరోతో స్పెషల్ సాంగ్ చేస్తుందంటే త్వరలోనే రష్మిక బీ టౌన్‌ను కూడా ఏలేస్తుంది అనుకుంటున్నారు అభిమానులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com